Guntur Kaaram Collections గుంటూరు కారం మూవీ వసూళ్లు ఫేక్ కలెక్షన్లా?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన నెగిటివ్ టాక్‌ను అధిగమించి రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. అయితే ఓ వర్గం ఈ సినిమాకు రెస్సాన్స్ లేదు. నిర్మాతలు ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అనే ఆరోపణలపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ..
గుంటూరు కారం మూవీ నెగిటివ్ టాక్, రివ్యూలు, సోషల్ మీడియాలో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉదయమే తప్పుడు రిపోర్టు ఇచ్చి ఆడియెన్స్‌ను గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను చూసి పాజిటివ్‌గా స్పందించడం ద్వారా మూవీ కలెక్షన్లు ఊపందుకొన్నాయి. ఈ సినిమాలో తల్లికొడుకుల సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. అందుకే ఇన్ని కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి అని నాగవంశీ చెప్పారు.

గుంటూరు కారం చిత్రంపై ఓ వర్గం మీడియా అతిగా ప్రేమను చూపిస్తున్నారు. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు ఫోన్ చేసి కలెక్షన్ల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. విడుదలైన ప్రతీ చోట బయ్యర్లు బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నారు. మా సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, విజయాన్ని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం అని నాగవంశీ చెప్పారు.
గతంలో సంక్రాంతి పండుగకు మా బ్యానర్ నుంచి సినిమా వచ్చింది. బాగాలేదని రివ్యూలు ఇచ్చారు. కలెక్షన్లు రాలేదు. కానీ గుంటూరు కారం సినిమా విషయంలో అది జరగలేదు. నెగిటివ్ రివ్యూలు వచ్చినా వాటి ప్రభావానికి గురి కాకుండా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఏ పరిస్థితుల్లో కూడా మా సినిమాపై వస్తున్న టాక్‌తో ధైర్యం కోల్పేదు అని నాగవంశీ చెప్పారు.

బుక్ మై షోలో కూడా రేటింగ్ విషయంలో మాపై దుష్ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని గుర్తించాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటి దుష్ప్రచారం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయంపై ఇప్పుడే ఏం చెప్పదలుచుకోలేదు. త్వరలోనే పెద్ద సక్సెస్ మీట్ పెట్టి మా మీద ప్రేమను చూపించే వారికి పార్టీ కూడా ఇస్తామని నాగవంశీ సెటైర్ కూడా వేశారు.

గుంటూరు కారం సినిమాకు వస్తున్న కలెక్షన్లు అన్నీ ఫేక్ అంటే అది తప్పు. మా చెప్పే కలెక్షన్లు ఫేక్ అని వాళ్లు ఫీల్ అయితే రుజువు చేయమనండి. మా సినిమా కలెక్షన్లు నిజమా? ఫేకా? నమ్మకం లేకపోతే మాకు జరిగే నష్టం లేదు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. బయ్యర్లకు లాభాలు వస్తున్నాయి అని నాగవంశీ చెప్పారు


Click it and Unblock the Notifications











