బ్లాక్ మనీ.. న్యూజిలాండ్ లో 7వేల ఎకరాలు.. స్పందించిన మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్, మంచు మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 40 ఏళ్లుగా విభిన్న చిత్రాల్లో నటిస్తూ అలరిస్తూనే వస్తున్నారు. హీరోగా విలన్ గా, కీలక పాత్రల్లో ఇప్పటివరకు 500 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక నిర్మాతగా కూడా గుర్తుండి పేరు చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 5 రోజుల్లో ఈ చిత్రం భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతోంది.

200 కోట్లతో కన్నప్ప నిర్మాణం..
మంచి ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు రానటువంటి చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మించారు. కన్నప్ప చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ చిత్రంలో భారీ తారాగణాన్ని నటింపజేసి ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. మరికొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చాలా గొప్పగా ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పటివరకు సినిమా నిర్మాణానికే 200 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పడం విశేషం.

Is Manchu Mohan Babu Buyed 7000 Acre Land in New Zealand

కన్నప్ప చిత్రానికి అంత డబ్బు ఎక్కడిది?
మంచి ఫ్యామిలీ నుంచి తొలిసారిగా భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రం రూపుదిద్దుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్లుగా ఇంత సాహసం చేయని మోహన్ బాబు ఒకేసారి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం ఏంటని చర్చలు కూడా సాగాయి. ఈ సినిమాకి ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తమ కష్టార్జితమని, బ్యాంకు లోను లోన్ తీసుకున్నామని ఇప్పటికే మంచి విష్ణు వివరణ ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రం అది బ్లాక్ మనీ అంటూ మంచి మోహన్ బాబు ఫ్యామిలీ పై చెడుగా ప్రచారం చేశారు. కన్నప్ప చిత్రం ప్రచార కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ఆ ఆరోపణలను ఖండిస్తూనే వస్తున్నారు.

న్యూజిలాండ్ 7 వేల ఎకరాలు..
ఇక తాజాగా మంచి మోహన్ బాబు న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు కొనుగోలు చేశానని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మోహన్ బాబు మాట్లాడుతూ ఈ ఏడు వేల ఎకరాలు మొత్తం మాదేనని, మంచు విష్ణు కోసం కొన్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ వీడియోను కెమెరాలో బంధిస్తున్న వ్యక్తి ఒకరు ఇదంతా బ్లాక్ మనీ అని వాక్యానించడం షాకింగ్ గా మారింది. అతను అలా అనడంతో మోహన్ బాబు వెంటనే ఖండించారు. ఎలాంటి బ్లాక్ మనీ లేదని, అంతా సొంత డబ్బుతోనే కొనుగోలు చేశానని చెప్పారు.

భారీ అంచనాలతో విడుదలకు కన్నప్ప..
కన్నప్ప చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ చీరలు పాత్రలలో నటించడం విశేషం. ముఖేష్ కుమార్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 27న చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X