కన్నప్ప నిడివి 52 గంటలా? మంచు విష్ణుకు పెద్ద ఛాలంజేనా?
తెలుగు సినిమా చరిత్రలోనే కొన్ని ఎపిక్ మాస్టర్ పీస్ సినిమాలు జాబితా తీస్తే వాటిలో తప్పకుండ నిలబె సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు నటించిన "భక్త కన్నప్ప" సినిమా కూడా తప్పకుండ ఉంటుంది. ఆ సినిమాకి ఒక స్థాయిని తాను తీసుకొచ్చారు. అయితే మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ లో ఆ సబ్జెక్టు ని తెరకెక్కించేందుకు పెద్దగా ఎవరూ సాహసించలేదు.
కానీ మంచు వారి హీరో మంచు విష్ణు కన్నప్ప సినిమానే తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఓ షాకింగ్ అనౌన్సమెంట్ అందరికీ అందించాడు. కాగా మంచు విష్ణు ఈ సినిమానే తన జీవితం అన్న రేంజ్ లో అప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాలు పక్కన పెట్టేసి మరీ సినిమాని చాలా అంచనాలు పెట్టుకుని మొదలు పెట్టేసాడు.

ఎక్కడా ప్లేస్ లేనట్టుగా స్టార్ట్ చేయడంతోనే సినిమా యూనిట్ అంతా న్యూజిలాండ్ కి వెళ్ళిపోయి చాలా నెలలు అక్కడే షూటింగ్ చేసి వచ్చారు. కాగా ఈ సినిమాని విష్ణు ఎంత ప్రత్యేకంగా తీసుకున్నాడు అంటే నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయిన "మహాభారతం" సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ని తెచ్చుకున్నాడు.
ఇక తారాగణం అయితే ఏం చెప్పి ఒప్పించారో కానీ ఇండియా లోనే ఆల్ మోస్ట్ అగ్ర నటులు అంతా ఈ సినిమాలోనే ఉన్నారు. తెలుగు నుంచి ప్రభాస్, మళయాళం నుంచి మోహన్ లాల్ హిందీ నుంచి అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజ హీరోలు ఈ సినిమాకి ఒప్పుకొని పని చేయడం సెన్సేషన్. ఇక మొన్ననే టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా మంచు వారి గత సినిమాలతో పోలిస్తే కాస్త ఓకే అనిపించే రెస్పాన్స్ వచ్చింది.

ఇక వీటితో పాటుగా తాజాగా ఓ షాకింగ్ రూమర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి ఇపుడు వరకు ఏకంగా 52 గంటల ఫుటేజ్ వచ్చింది అని ఓ మాట వైరల్ అవుతుంది. అయితే దీనిని 3 గంటలకి కుదించారు అని అంటున్నారు. మామూలుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ లో ఎలాంటి ట్రోల్స్ పడుతుటాయో చూస్తుంటాము.
సో ఓ సినిమాకి 52 గంటల ఫుటేజ్ అంటే నమ్మశక్యంగా లేదు. అలా కేవలం ట్రోలింగ్ గా మాత్రమే ఇది పుట్టించి ఉండొచ్చు అని చెప్పాలి. మొత్తానికి అయితే కన్నప్ప తో మాత్రం మంచు విష్ణు ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి తాను పెట్టుకున్న ఆశలన్నీ ఈ సినిమాతో చేరుకుంటాడో లేక మళ్ళీ ట్రోల్స్ కే గురవుతాడో వేచి చూడాలి. కాగా ఈ భారీ సినిమాని మంచు మోహన్ బాబు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ భాషల్లో ఈ సినిమాని వారు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాలం సహా గ్లోబల్ భాష ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











