Chiranjeevi: అందరి ముందు సిల్క్ స్మితను చిరంజీవి కొట్టారా? అసలేం జరిగిందంటే?
chiranjeevi silk smitha: ఎవర్ గ్రీన్ నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అందాల భామ తన అందాల ఆరబోతతో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరుగా మారింది సిల్క్ స్మిత. తన మత్తెక్కించే కళ్ళతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 200కు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంది ఈ అమ్మడు. అయితే.. సిల్క్ స్మిత పై మెగాస్టార్ చిరంజీవి చేయి చేసుకున్నారట. ఇంతకీ ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి ఏంటి? సిల్క్ స్మిత ను కొట్టడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? నిజంగానే సిల్క్ స్మితను చిరంజీవి కొట్టారా? కొడితే ఎందుకు కొట్టారు? ఆ గొడవకు కారణం ఏంటి? లేదా ఏదైనా షూటింగ్లో భాగంగా కొట్టారా? అసలేం జరిగిందో తెలుసుకుందాం.. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన స్వయంకృషితో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుస విజయాలను అందుకున్నారు. ఆయన స్టార్ డమ్ సొంతం చేసుకున్నతర్వాత ఎంతోమందికి చేయూతనిచ్చారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి సిల్క్ స్మిత పై చేయి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న జయకుమార్ కనగాల అనే వ్యక్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అండ్ బ్యూటీ సిల్క్ స్మిత మధ్య జరిగిన వివాదాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆదివారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జయ కుమార్ కనగాల మాట్లాడుతూ.. చిరంజీవి, సిల్క్ స్మిత కాంబోలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి. అయితే.. ఒక సినిమాలో చిరంజీవి షూటింగ్లో భాగంగా సిల్క్ స్మితను కొట్టే సీన్ పెట్టారు దర్శక నిర్మాతలు. అయితే ఆ సీన్ గురించి తెలుసుకున్న సిల్క్ స్మిత 'నన్ను చిరంజీవి కొడతారా?' అంటూ సెటైరికల్ గా మాట్లాడింది.
అంతే కాదు.. ఆసన్నివేశంలో తాను నటించననీ, ఆ సీన్ తొలగించాలని మొండికేసిందట. ఆ సీన్ డిమాండ్ చేస్తుందని, ఈ సినిమాలో ఆ సీన్ మెయిన్ అని నచ్చ చెప్పడంతో అందుకు ఆ అమ్మడు ఓకే చెప్పిందట. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి చెవిన పడింది. ఇక ఆ సీన్ షూట్ సమయంలో చిరంజీవి నిజంగానే సిల్క్ స్మిత పై చేయి చేసుకున్నారు. సిల్క్ స్మిత చెంప పలగొట్టారు. దీంతో అవమానంగా భావించిన సిల్క్ స్మిత తాను ఆరు గంటలకే వెళ్ళిపోతానని సెట్ లో నానా రచ్చ చేసింది. కానీ, డైరెక్టర్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పారంట. దీంతో మొండికేసి సిల్క్ స్మిత మద్యం సేవిస్తూ అక్కడనే ఉండిపోయింది' అని పేర్కొన్నారు. అయితే.. వార్తలో ఎంత నిజముందో ఆనాటి దర్శక నిర్మాతలకే తెలియాలి. ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారుతోంది.


Click it and Unblock the Notifications











