పరారీలో మోహన్ బాబు?? పుకార్లపై అసలు నిజం వెలుగులోకి

ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో వినిపిస్తున్న రెండు మేజర్ ఇష్యూస్ సినీ పరిశ్రమకి సంబంధించినవే. ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాగా.. మరొకటి మంచు వారి కుటుంబపు గొడవలు అని చెప్పాలి. తొలుత మోహన్ బాబు కుటుంబంలో గొడవలు బయటికొచ్చి పెద్ద ఎత్తున కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఇపుడు ఊహించని విధంగా దీనిని బీట్ చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ అంశం ఒక్కసారిగా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే షాకింగ్ వార్తలతోనే ఇంకో పక్క సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా అరెస్ట్ అవుతారు అంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అల్లు అర్జున్ అరెస్ట్ తో ఫోకస్ ఎక్కువ అటు వైపుకి వెళ్లేసరికి మోహన్ బాబు పరారీలో ఉన్నారని పోలీసులకి దొరక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అంటూ క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.

is mohan babu missing for arrest here is what he said

అయితే మోహన్ బాబు విషయలో కొన్ని రోజుల క్రితమే తన కుమారుడు మంచు మనోజ్ కాదు పెట్టిన కేసు, అలాగే మోహన్ బాబు కేసు పెట్టిన వార్తలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. వీటితో పాటుగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన కేసు కూడా తనపై అదనంగా పడింది. దీంతో మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి ఎక్కడికో వెళ్లిపోయారు అంటూ వార్తలు మొదలయ్యాయి.

దీంతో ఈ వార్తలపై లేటెస్ట్ గా మోహన్ బాబు స్వయంగా స్పందించడం జరిగింది. మోహన్ బాబు ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నేనెక్కడికి పారిపోలేదు నా ఇంట్లోనే ఉన్నాను అని.. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాపై తప్పుడు ప్రాపగాండాలు ప్రచారం చేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు.

అలాగే తన అరెస్ట్ విషయంపైనా మాట్లాడుతూ తనకి ముందస్తు బెయిలు తిరస్కరించబడింది అనే వార్తలు కూడా అవాస్తవం అని మోహన్ బాబు స్పష్టం చేశారు. దయచేసి మీడియా వారు అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను అని మోహన్ బాబు తనపై వస్తున్న పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మోహన్ బాబు ఎక్కడికీ పారిపోలేదు తన ఇంట్లోనే ఉన్నారు అని ఓ క్లారిటీ అయితే బయటికి వచ్చింది.

మోహన్ బాబు రికవర్ అయ్యాక గాని తన అరెస్ట్ ఉంటుందా? లేక తన ముందస్తు బెయిల్ ఎలాగో రిజెక్ట్ కాలేదు కాబట్టి వెళ్లకపోవచ్చని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మంచు కుటుంబంలో మంచు మనోజ్ తన సినిమా భైరవం షూటింగ్ లో జాయిన్ కాగా మంచు విష్ణు కూడా ఇక్కడ వేరే ఏవో పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అటు మంచు లక్ష్మి మాత్రం ఈ కాంట్రవర్సీ లకి దూరంగా ముందు నుంచి ఉంది. ఇలా మొత్తానికి మంచు వారి కుటుంబంలో మంచి హై డ్రామా నడుస్తుంది అని చెప్పొచ్చు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X