ప్రభాస్ వివాదం.. బాలీవుడ్ నటుడిపై నిప్పులు చెరిగిన నాగ్ ఆశ్విన్
పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు.. ఒక స్టార్ హీరో దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో తమకి తమదారిలో పూలు వేసేవారితో పాటుగా రాళ్లు రువ్వే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూనే ఉంటారు. కాగా ఇది ప్రస్తుతం అయితే టాలీవుడ్ హీరో ప్రభాస్ విషయంలో కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పాలి. బాహుబలి ఇచ్చిన ఫేమ్ తో తెలుగు సినిమాని ఇండియన్ సినిమాని ప్రపంచంలో ఉన్నత స్థానంలో పెట్టాలని ప్రభాస్ నిరంతరం శ్రమిస్తున్నాడు.
కానీ ఇప్పటికీ కొన్ని ఇండస్ట్రీల వారు ప్రభాస్ వర్క్ కోసం పాజిటివ్ గా మాట్లాడకపోవడం అటుంచితే ప్రభాస్ చేసే సినిమాలకి వంకలు పెడుతూ ఆనందం పొందుతున్నారు. కాగా ఇటీవల ప్రభాస్ నటించిన హిట్ సినిమానే "కల్కి 2898 ఎడి". దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఎన్నో ఏళ్ళు శ్రమించి తెరకెక్కించాడు. కాగా చిత్ర యూనిట్ పడ్డ కష్టం అంతటికి తగ్గ ఫలితాన్నే మొత్తం టీం అందుకుని బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ సక్సెస్ ని అందుకున్నారు.

కానీ బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ మాత్రం ప్రభాస్ విషయంలో తీవ్ర అభ్యంతరాలను తీసుకొచ్చాయి. ప్రభాస్ కల్కి సినిమాలో జోకర్ లా కనిపించాడు అని తన రోల్ బాగోలేదు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. దీనితో గత వారం రోజుల నుంచి సోషల్ మీడియా అంతా ఒకటే హీట్ నడుస్తుంది. కాగా కల్కి సినిమా ఎప్పుడైతే ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది.
ఇంకో పక్క దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. అలా అర్షద్ కామెంట్స్ కి ఇచ్చిన కౌంటర్ ఇపుడు వైరల్ గా మారింది. అర్షద్ చేసిన కామెంట్స్ అలా చేసి ఉండకూడదు అని మరింత బెటర్ గా తాను మాట్లాడాల్సింది అంటూ స్మూత్ గా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన పిల్లలకి తమ సినిమా బుజ్జి కారు బొమ్మలు పంపిస్తాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
దీనితోనే చివరలో ఇంకో పాయింట్ కూడా చెప్పాడు నాగి. ఇది మాత్రం అర్షద్ చేసిన కామెంట్స్ ని ఒప్పుకున్నట్టే అనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ నాగశ్విన్ అర్షద్ చేసిన కామెంట్స్ ని మరో పదాలతో చెప్పి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ప్రభాస్ ని జోకర్ అనడం తప్పే కానీ అర్షద్ చెప్పాలి అనుకున్న దానిలో పాయింట్ ని తాను ఒప్పుకున్నాడు.

కల్కి సినిమా చూసిన తర్వాత చాలా మందికి ప్రభాస్ విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రభాస్ రోల్ ని ఒక్క క్లైమాక్స్ లో కర్ణుడిగా రివీల్ చేయడం మినహా మిగతా సినిమా అంతా అమితాబ్ బచ్చన్ నే మెయిన్ హీరోలా ఉన్నాడు అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. కాగా ఈ కోణంలోనే అర్షద్ కూడా ప్రభాస్ ని కల్కి లో ఇంకా పవర్ఫుల్ గా చూడాలి అనుకున్నాను అని తెలిపాడు కానీ తాను ఏదైతే పదం వాడాడో జోకర్ అని.. ఇది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది.
దీనితో ఇందుకే నాగశ్విన్ కూడా తాను పార్ట్ 2 లో మాత్రం ప్రభాస్ ని బెస్ట్ ఎవర్ గా చూపించడానికి ట్రై చేస్తాను అంటూ రిప్లై ఇచ్చాడు. అంటే అర్షద్ కామెంట్స్ ని ఇంకా కల్కి 1 లో ప్రభాస్ రోల్ పై వచ్చిన విమర్శలని తాను ఒప్పుకున్నట్టే కదా! ఆల్రెడీ పార్ట్ 2 లో ప్రభాస్ అండ్ కమల్ హాసన్ లపై ఫేస్ టు ఫేస్ యాక్షన్ సీక్వెన్స్ లు నెస్ లెవెల్లో ఉంటాయని టాక్ ఉంది. మరి పార్ట్ 2 లో ప్రభాస్ ని అంతా కోరుకున్నట్టుగా చూపిస్తే అంతకు మించిన హ్యాపినెస్ లేదని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











