అనిల్ రావిపూడి స్టైల్‌లో నాగ్ అశ్విన్.. డైరెక్టర్‌కు ప్రభాస్ క్లాస్..

సినిమా ప్రమోషన్స్‌ విషయంలో అనిల్‌ రావిపూడి స్టైలే వేరు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా వినూత్న ప్రచార కార్యక్రమాలు చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సినిమాకు ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రమోషన్స్‌ ప్లాన్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో హైప్‌ క్రియేట్ చేస్తుంటారు. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో సైతం ప్రమోషన్స్ చేయించిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు అదే స్టైల్‌‌ను పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ఫాలో అవుతున్నారా? ఆయన కూడా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ను రంగంలోకి దించారు. ఇంతకీ ఏం సినిమా? అసలేం జరిగింది?

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ అంటే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్. 'కల్కి 2898 AD'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ జోడీ ఇప్పుడు 'కల్కి 2' పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా మరో ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమా'సింగ్ గీతం'. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ కలిసి చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ మారింది. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Is Nag Ashwin Following Anil Ravipudi s Promotion Strategy Prabhas Joins Sing Geetham Buzz

'సింగ్ గీతం'కు నిర్మాతగా వ్యవహరించిన నాగ్ అశ్విన్, సినిమా ప్రత్యేకతను చెబుతుండగా ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్‌తో దర్శకుడిని ఆటపట్టించాడు. "ఇండియన్ సినిమా చరిత్రలో మాటల స్థానంలో పాటలతో కథ చెప్పిన తొలి సినిమా" అని నాగ్ అశ్విన్ చెప్పగా, "అలా కాదు.. ఇంకా గట్టిగా చెప్పాలి" అంటూ ప్రభాస్ సరదాగా మాట్లాడుతాడు. ఈ సమయంలో నాగ్ అశ్విన్ మళ్లీ అదే విషయాన్ని గట్టిగా చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ సన్నివేశాన్ని చూసిన అభిమానులు 'అనిల్ రావిపూడి స్టైల్‌లో నాగ్ అశ్విన్ ప్రమోషన్ చేస్తున్నాడు' అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇక 'సింగ్ గీతం' గురించి మాట్లాడిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు, ఇది తన 40 ఏళ్ల కల అని చెప్పారు. ఆ కలను నిజం చేసిన ఘనత మొత్తం నాగ్ అశ్విన్‌దేనని ప్రశంసించారు. మాటల బదులు పాటల ద్వారా కథ చెప్పడం సాహసోపేతమైన ప్రయోగమని, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమని మూవీ మేకర్స్ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు 'కల్కి 2'కు సంబంధించిన ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా ప్రచారం ప్రకారం, నాగ్ అశ్విన్ 'కల్కి'ని కేవలం రెండు భాగాల సినిమాగా మాత్రమే కాకుండా ఒక విస్తృత సినీ విశ్వంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారట.

'కల్కి 2898 AD'లో కనిపించిన కొన్ని కీలక పాత్రలపై ప్రత్యేక ఓటీటీ చిత్రాలు లేదా స్పిన్-ఆఫ్ ప్రాజెక్టులను రూపొందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మొదటి భాగంలో కేవలం కొద్దిసేపే కనిపించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ పాత్రలకు సంబంధించిన పూర్తి బ్యాక్‌స్టోరీలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X