Kalki 2898AD: బుజ్జీ క్యారెక్టర్‌ను నాగ్ అశ్విన్ కాపీ కొట్టాడా..? పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగానే ప్రభాస్..!

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898AD. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన బుజ్జి, భైరవ గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా రెస్పాన్స్ వస్తున్నది. అయితే తాజాగా రిలీజ్ చేసిన భైరవ, బుజ్జి గ్లింప్స్ చూసిన తర్వాత అది కాపీ అనే విషయం స్పష్టమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని భారీగా అంటే.. సుమారుగా 700 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించారు. అత్యంత సాంకేతికంగా ఈ సినిమాను రూపొందించినట్టు ప్రచార చిత్రాలు, టీజర్లు స్పష్టం చేయడమే కాకుండా అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపాయి.

Is Nag Ashwin inspired Prabhas s Bhairava and Bujji characters of Kalki 2898AD from Krishnam Raju s Cheyyethi Jai Kottu

కల్కి 2898AD చిత్రంలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్రకు స్నేహితుడిగా బుజ్జి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పరికరం ఓ రోల్ ఉంది. విపత్కర పరిస్థితుల్లో ఉన్న భైరవను ముందుకు నడిపించే పరికరంగా బుజ్జి ఓ పాత్రను పోషించబోతున్నది. చిన్న పిట్టల ఉన్న పరికరం అందర్నీ ఆకట్టుకొంటున్నది.

ఇటీవల బుజ్జి, భైరవకు సంబంధించిన కెమిస్ట్రీని తెలిపే ప్రమోషనల్ కంటెంట్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ప్రచార చిత్రాల్లో భాగంగా భైరవ (ప్రభాస్) తన భుజాలపై బుజ్జిని పెట్టుకొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే భైరవ తన భుజాలపై బుజ్జిని పెట్టుకోవడమనే విషయాన్ని నాగ్ అశ్విన్ కాపీ కొట్టారనే విషయాన్ని నెటిజన్లు పసిగట్టారు. అయితే కొందరు మాత్రం దానిని ప్రభాస్, కృష్ణంరాజు అభిమానుల కోసం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Is Nag Ashwin inspired Prabhas s Bhairava and Bujji characters of Kalki 2898AD from Krishnam Raju s Cheyyethi Jai Kottu

అయితే కాపీ అనే విషయానికి వస్తే.. గతంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు చెయ్యెత్తి జైకొట్టు అనే సినిమాలో అలాంటి సీన్‌ను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో కృష్ణంరాజకు రుద్రయ్య అనే పెంపుడు పావురం స్నేహితుడిగా ఉంటుంది. అయితే తన భుజంపై ఉన్నంత సేపు కృష్ణంరాజు చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటాడు. ఇక ఫైట్ చేయాల్సిన సమయంలో రుద్రయ్య లేచిపో అంటూ సంకేతం ఇస్తాడు. అలా చెప్పగానే పావురం భుజంపై నుంచి లేచిపోతుంది. ఆ తర్వాత దుండుగల భరతం పట్టడం కృష్ణంరాజు వంతు అవుతుంది.

Is Nag Ashwin inspired Prabhas s Bhairava and Bujji characters of Kalki 2898AD from Krishnam Raju s Cheyyethi Jai Kottu

అలాగే.. కల్కి 2898AD చిత్రంలో బుజ్జి కూడా ప్రభాస్ భుజంపై కనిపించింది. ఇక ఈ సినిమాలో భైరవకు బుజ్జి ఫ్రెండ్ అనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సో.. తన పెదనాన్న నటించిన చెయ్యెత్తి జైకొట్టు సినిమాలోని సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని భైరవ, బుజ్జి మధ్య బాండింగ్ క్రియేట్ చేసి ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనా రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇది మరింత జోష్ కలిగించే విషయంగానే చూడాలంటున్నారు.

అయితే కల్కి మూవీలో కూడా రుద్రయ్య మాదిరిగానే బుజ్జిని ట్రీట్ చేస్తారా? శత్రువులను వెటాడే సమయంలో బుజ్జిని దూరంగా పెడుతారా? ఇలాంటి సీన్లు రిపీట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X