నాగార్జున ‘మన్మథుడు’ ఫస్ట్ హీరో ఎవరో తెలుసా? అప్పట్లో సక్సెస్ కు కెరాఫ్ ఆయన

కింగ్ అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. 65 ఏళ్లు వచ్చినా టాలీవుడ్ సీనియర్ హీరోగానే ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. 38 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. పలు రికార్డులను తనపై నమోదు చేసుకున్నారు. లెజెండరీ యాక్టర్, దివంగత అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సక్సెస్ ఫుల్ నటుడిగా నిలిచారు.

ప్రస్తుతం నాగార్జున తనయులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా తమ తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో తమకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చివరిగా 'బంగార్రాజు', 'నా సామీ రంగ' చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్నారు. ఇదిలా ఉంటే... నాగార్జున కెరీయర్ లో ఎన్నో ఉత్తమమైన సినిమాల్లో నటించారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో నాగార్జున నటించిన సినిమాలు కూడా ఉండటం విశేషం.

is Nagarjuna not Manmadhudu Movie First Choice

అందులో ఒకటి 'మన్మథుడు'. ఈ చిత్రాన్ని కే విజయ భాస్కర్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు కథ, మాటలను అందించింది ప్రస్తుత టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ త్రివిక్రమ్ ఇంకా డైరెక్టోరియల్ డెబ్యూ ఫిల్మ్ ఇవ్వలేదు. అంతకు ముందు పలు చిత్రాలకు కథలను అందిస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గ్గా మారారు. అయితే మన్మథుడు సినిమా సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథతో పాటు మరో కథను టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన తరుణ్ తో తెరకెక్కించాలని భావించారంట. కానీ ఆ సమయంలో తరుణ్ ఫుల్ బిజీగా ఉండటంతో ఇక అలాంటి కథకు కేవలం నాగార్జున గారికే సెట్ అవుతుందని విజయ్ భాస్కర్ అనుకున్నారంట.

దాంతో వెంటనే వెళ్లి నాగ్ కు కథ చెప్పడంతో నచ్చిందంట. మన్మథుడు అనేసరికి ఒప్పుకుంటారో ఒప్పుకోడో అని సందేహించినా.. ఈ సినిమాలో మీ పాత్ర మన్మథుడు అయినా మీకు అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదని చెప్పిన పాయింట్ తో నాగ్ కన్విన్స్ అయ్యారంట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమాను తానే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారంట. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. 2002లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ నను సొంతం చేసుకుంది.

అయితే ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న కథలు మరొకరి సెట్ అవుతాయి. కానీ ఈ కథ మాత్రం నాగార్జునకు తప్పా మరెవ్వరికీ సెట్ కాబోదు అనేంతలా నాగార్జున స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. నాగార్జున సరసన స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, లండన్ బ్యూటీ అన్షు అంబానీ అద్భుతంగా నటించారు. ఇక ప్రస్తుతం నాగార్జున రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'కూలి' చిత్రంలో సిమాన్ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X