Balayya 50 Years: బాలయ్య ఈవెంట్ పైనే అందరి కన్ను.. మెగా, అల్లు అసలు సిసలు క్లారిటీ
టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ నడుమ ఎప్పుడూ కొన్ని చిన్న చిన్న స్పర్థలు ఉండొచ్చు తప్ప మరీ పర్శనల్ గా తీసుకునే రేంజ్ గొడవలు మాత్రం ఎవరికీ లేవని చెప్పాలి. అలా తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్ ఫ్యామిలీస్ లో బిగ్గెస్ట్ రైవల్ ఫ్యామిలీస్ ఏవి అంటే అవి ఖచ్చితంగా మెగా అండ్ నందమూరి కుటుంబాల నడుమ సినిమాల బాక్సాఫీస్ యుద్ధాలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య నడుస్తూ ఉంటాయి.
కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా.. అలానే కాలం మారింది పరిస్థితులు కూడా మారాయి. మెగా హీరోలు నందమూరి హీరోలు కలిసి సినిమాలు చేయడం షోలో పాల్గొనడం ఇంకా పలు రాజకీయాల్లో కూడా కలిసి వర్క్ చేసే విధంగా రోజులు మారిపోయాయి. సరే ఇవి అయ్యాయి అనుకుంటే ఇపుడు ఏకంగా మెగా హీరోస్ లోపలే యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి.

తెలుగు సినిమా దగ్గర మెగా హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ స్టార్ట్ చేసి ఇంతటి వాడు అయ్యాడు అన్నది ఉన్న మాట. కానీ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాక మెగా హీరోస్ విషయంలో తాను చూపిస్తున్న పక్షపాతం కానీ చేస్తున్న కామెంట్స్ కానీ మెగా అభిమానుల్లో ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకే దారి తీశాయి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాదు మెగా అభిమానులే గొడవలు పడుతున్నారు.
మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా ఇపుడు విడిపోయి సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ నడుస్తుంది. కాగా దీనికి ఒక ఎండింగ్ కోసం ఇలాంటి గొడవలు వద్దు అని చూస్తున్న న్యూట్రల్ మెగా ఫ్యాన్స్ చూస్తున్నారు. కానీ ఇది ఒక నందమూరి హీరో వల్ల సాధ్యం అయ్యేలా ఉందని అనిపిస్తుంది. కాగా ఈ సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో నందమూరి నటసింగం బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి.
దీనితో అటు మెగాస్టార్ చిరంజీవికి ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీ ఆహ్వానాలు వెళ్లాయి. ఓ ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇద్దరూ కూడా వెళితే ప్రస్తుతం నడుస్తున్న కాంట్రవర్సీకి ఒక ఎండ్ కార్డు పడినట్టే అవుతుంది అని చెప్పొచ్చు. వెళితే ఎలాగో ఒకే వేదిక పంచుకుంటారు కాబట్టి అల్లు అర్జున్, చిరంజీవిలు కలిసి మాట్లాడే సందర్భం తప్పకుండా వస్తుంది.
సో బాలయ్య సినిమా ప్రస్థాన వేడుకలు ఇప్పుడు మెగా అండ్ అల్లు గొడవల నడుమ కీలక పాత్ర వహించనుంది. కాగా ఈ వేడుకలు ఈ సెప్టెంబర్ 1న జరగబోతున్నాయి. మరి చూడాలి ఈ వేడుకలతో ఇన్ని రోజులు నడుస్తున్న కాంట్రవర్సీకి ఏమన్నా ఎండ్ కార్డు పడుతుందో లేదో అనేది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ అయ్యితే తన భారీ చిత్రం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పాన్ ఇండియా అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 లో బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్య విషయానికి వస్తే తాను దర్శకుడు కొల్లి బాబీ చేస్తున్న 109వ సినిమాలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











