Lucky Baskhar: లక్కీ భాస్కర్‌ను మిస్ చేసుకొన్న తెలుగు హీరో ఎవరంటే? ఫస్ట్ ఛాయిస్ దుల్కర్ సల్మాన్ కాదా?
ఈ ఏడాదిలో తెలుగు సినిమా పండుగలు అన్నిటికి కూడా పలు క్రేజీ సినిమాలే రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సంక్రాంతి మొదలుకొని ఇపుడు దీపావళి వరకు కూడా ప్రతీ పండుగకి పలు సినిమాలు మన తెలుగు నుంచి సహా ఇతర భాషల నుంచి కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా ఇపుడు దీపావళి సందర్భంగా వచ్చిన సినిమాల్లో అప్పుడు సంక్రాంతికి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు రాగా ఇపుడు మళ్ళీ ఇప్పుడు దీపావళికి మంచి సక్సెస్ రేట్ ని ఇండస్ట్రీ చూసింది. కాగా ఈ సినిమాల్లో తెలుగు నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమా "లక్కీ భాస్కర్" కూడా ఒకటి. కాగా తెలుగులో మంచి వెల్కమ్ అందుకున్న మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తన సక్సెస్ స్ట్రీక్ ని మైంటైన్ చేస్తూ తెలుగులో మరో హిట్ ని తాను కొట్టేసాడు.

అయితే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ వెళుతుంది. అయితే ఈ సినిమాలో ఒక ఫ్యామిలీ మ్యాన్ గా దుల్కర్ కనిపించగా తనకి ఇలాంటి పత్రాలు కొత్త ఏమీ కాదు కాబట్టే అటు యంగ్ ఇటు ఇలాంటి ఫ్యామిలీ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ లక్కీ భాస్కర్ సినిమాకి మాత్రం అసలు మొదటి ఛాయిస్ దుల్కర్ సల్మాన్ కాదు అని ఇపుడు తెలుస్తుంది.
కాగా వెంకీ అట్లూరి ఈ ఫ్యామిలీ అండ్ కరెన్సీ డ్రామాని దుల్కర్ కోసం రాయలేదట. తనకంటే ముందే ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని కోసం తాను సిద్ధం చేసాడట. ఈ సినిమాకి మొదటి ఛాయిస్ నాని కాగా తన కోసం సిద్ధం చేస్తే ఈ సినిమాని నాని వద్దు అనుకున్నాడట. అయితే దీనికి స్ట్రాంగ్ రీజన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కి ఒక భార్య కొడుకు ఉంటాడని తెలిసిందే.

అంటే హీరో ఒక తండ్రిలా కూడా కనిపించాల్సి ఉంది. అయితే ఈ సినిమా విషయంలో తనకి ఇది నచ్చలేదట. అప్పటికే తాను హాయ్ నాన్న సినిమాలో ఒక సారి ఫాదర్ రోల్ ని చేయగా మరోసారి చేయడం ఇష్టం లేదని అందుకే ఈ కథని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అలా నాని దగ్గరకి వెళ్లిన ఈ కథ ఫైనల్ గా దుల్కర్ దగ్గరకి వెళ్లి ఇపుడు సెన్సేషనల్ హిట్ అయ్యింది.
కాగా ఈ సినిమాలో హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి దుల్కర్ సల్మాన్ సరసన నటించగా సాయి కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా నాగవంశీ, మాటల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లు నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా తర్వాత దుల్కర్ తెలుగులో మరిన్ని సినిమాలు ఓకే చేయగా ఇవి రానున్న కొన్నేళ్లలో విడుదలకు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











