‘గే’ పాత్రలో నాని..? ‘పారడైజ్’ స్టోరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాని చేస్తున్న సినిమాల్లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పారడైజ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్నాయి చిత్రం నాని అభిమానులనే కాకుండా నార్మల్ ఆడియన్స్ను కూడా ఎంతో వేచి ఉండేలా చేసింది. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ కు ఇంటర్నెట్ షేక్ అయింది. ముఖ్యంగా నాని నోట శ్రీకాంత్ ఓదెల పలికించిన పదాలు ఆశ్చర్య పరిచాయి. దీంతో నాని చేయబోయే పాత్ర పై మరింత ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో పారడైజ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా నాని చేస్తున్న ఓ చాలెంజింగ్ రోల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ను, యువతను మెప్పించేలా సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారడంతో నాని కూడా తన నట్ట విశ్వరూపాన్ని చూపించేందుకు కాస్త రూట్ ను మార్చారు. దాంతో నాని చేస్తున్న ప్రతి సినిమాపై ఆడియన్స్ కు ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది.

శ్యాం సింగరాయ్ చిత్రం నుంచి మొదలు ఇప్పటివరకు నాని చేస్తున్న ప్రతి సినిమా ఆడియన్స్నే కాకుండా ఇండస్ట్రీలోని ప్రముఖులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని కాస్త బయపెట్టేందుకు యాక్షన్ బాట పట్టారు నాని. రీసెంట్ గా వచ్చిన చిత్రాలన్నీ యాక్షన్ తో అదరగొట్టాయి. నాని కూడా తనలోని కొత్త కోణాన్ని చూపిస్తూ ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తున్నారు. కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో గతంలో వచ్చిన ' దసరా' మూవీతో ఏకంగా రఫ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేశారు. ఇంకా మరోసారి ఈ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంతో ఇంకా రెట్టింపు స్థాయి యాక్షన్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా పారడైజ్ సినిమాలో నాని నటిస్తున్న పాత్ర పై ఇప్పుడు చాలా ఆసక్తి నెలకొంది. నాని ఈ చిత్రంలో ఒక ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నారట. అది కూడా యాక్షన్ సీన్ కోసం ఆ పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లోను నాని రెండు జడలత, ముక్కుపుడకలతో కనిపించిన విషయం తెలిసిందే. ఆ విధంగాను నాని ట్రాన్స్ జెండర్ గా కనిపిస్తారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావలసి ఉంది. ఇదిలా ఉండగా పారడైజ్ మూవీ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా మారింది.
1980 కాలంలో సికింద్రాబాద్లో నివాసం ఉండిన ఓ నిరక్షరాస్యులు, మార్జినలైజ్డ్ ట్రైబల్ గ్రూప్ గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నారని తెలుస్తోంది. అయితే చాలా విషయాలు హక్కులు కోల్పోయిన వారి కోసం పోరాడే వ్యక్తి కథనే ఈ సినిమా. ఈ సినిమాలో నాని లం... అంటూ వాడిన పదం ఆధారంగానే తమ సంఘానికి నాయకుడు అవుతాడని, ఆ సంఘం సమస్యలను తీర్చేందుకు యుద్ధం కూడా చేస్తాడని తెలుస్తోంది. తిరిగి ఆ ట్రైబల్ కి అన్ని హక్కులు కల్పించే దేవుడులా మారిపోతాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











