విడాకులు దిశగా నయనతార, విఘ్నేష్? వేణుస్వామి చెప్పిందే నిజమౌతుందా?

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ చేసి స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి ప్రస్తుతం హాయిగా గడుపుతోంది. భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేధికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటుంది.

కానీ తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తుంటే.. నయన్ జీవితంలోకి మళ్లీ కష్టాలు రాబోతున్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా ఆమె తన భర్త విఘ్నేష్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లుగానే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారిన ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Is Nayanatara taking Divorce with Vignesh Shivan Here is Mystic Post by Actress

హీరోయిన్ నయనతార పిల్లలు పుట్టక ముందు వరకూ సోషల్ మీడియా వాడలేదు. భర్త, ఇద్దరు పిల్లలు తన జీవితంలోకి వచ్చాకా... ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా తన భర్త విఘ్నేష్ శివన్ తో పాటు తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తన హ్యాపీనెస్ ను అభిమానులతో పంచుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన భర్త విఘ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేసింది. ఆ తర్వాత ఓ స్టోరీ కూడా పెట్టింది. కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అంటూ రాసుకొచ్చింది.

ఎప్పుడూ నవ్వుతూ, హ్యాపీగా ఉండే నయన్ ఇలాంటి పోస్ట్ పెట్టడం.. ముఖ్యంగా భర్తను అన్ ఫాలో చేయడంతో క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. అనేక మీడియా ఛానెళ్లు, న్యూస్ పేపర్లలో ఆ వార్త హైలెట్ అయింది. అయితే ఇదంతా జరిగిన కాసేపటికే నయనతార మళ్లీ తన భర్తను ఫాలో అవడం ప్రారంభించింది. అయితే ఇదంతా పొరపాటును జరుగిందా, టెక్నికల్ సమస్యల వల్ల జరిగిందా, నయన్ కావాలనే చేసిందా అనేది మాత్రం తెలియదు.

Is Nayanatara taking Divorce with Vignesh Shivan Here is Mystic Post by Actress

కానీ నెటిజెన్లు మాత్రం ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు. విఘ్నేషన్, నయన్ ఎప్పటికీ కలిసే ఉంటారని కొంతమంది చెబుతున్నారు. పొరపాటున అన్ ఫాలో అయి ఉంటుందని, టెక్నికల్ సమస్యల వల్లే జరిగి ఉంటుందంటూ సమాధాన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరేమో వీరు విడిపోవడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిందే నిజం కాబోతుందని.. త్వరలోనే నయనతార, విఘ్నేష్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రాసుకొస్తున్నారు.

గతంలో వేణుస్వామి నయన తార, విఘ్నేష్ శివన్ లు విడాకులు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. వారిద్దరూ కలిసి ఉండడం కష్టం అని.. ముఖ్యంగా 2024 లేదా 2025లో కచ్చితంగా విడిపోతారని కూడా అన్నారు. ప్రస్తుతం నయన్ భర్తను అన్ ఫాలో కొట్టడంతో వారిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ జంట ఈ ఘటనపై ఓ క్లారిటీ ఇస్తే తప్పు పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X