అల్లు అర్జున్‌కు నయనతార అవమానం.. లేడీ సూపర్‌స్టార్‌పై ఎలాంటి దెబ్బ పడిందంటే?
సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తర్వాత కానీ ఫలితాన్ని బట్టి డ్యామేజ్ కంట్రోల్ చేసుకొన్నా ఫలితం ఉండదు. అయితే నయనతార విషయంలో నెటిజన్లు ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్‌తో ఆమె వ్యవహరించిన తీరు వల్లే అవకాశాలు కోల్పోయారనే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ విషయంలోకి వెళితే..
దక్షిణాదిలో నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తీరు అందర్నీ ఆకట్టుకొంటుంది. మలయాళం, తమిళం, తెలుగు అనే తేడా లేకుండా ఆమె అగ్ర హీరోలందరీతో జతకట్టింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గానే కాకుండా అత్యధికంగా పారితోషికం అందుకొనే హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు, పాపులారిటీని సాధించారు.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ నుంచి ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలతో నటించి క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకొన్నది. అయితే టాలీవుడ్‌లో ఆమె కెరీర్ గ్రాఫ్ భారీగా పెరుగుతున్న సమయంలోనే ఆఫర్లు తగ్గిపోయాయి. అందుకు కారణం అల్లు అర్జున్‌ను ఓ అవార్డు పంక్షన్‌లో అవమానించడమే అనే విషయాన్ని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సైమా పురస్కారాల్లో భాగంగా 2016 సంవత్సరంలో జరిగిన అవార్డు ఫంక్షన్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఆ వేడుకలో నయనతార ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకొన్నది. ఆమెను అల్లు అర్జున్ చేతులు మీదుగా తీసుకోవాలని నిర్వాహకులు స్టేజ్ మీదకు పిలిచారు. ఆమె స్టేజ్ మీదకు వచ్చి అల్లు అర్జున్‌ను చూసింది. అయితే ఐకాన్ స్టార్‌తో తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దాంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

అయితే ఈ అవార్డును తన ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో తీసుకోవాలని అనుకొంటున్నాను. ఆయన ఇస్తే నాకు ఆనందంగా ఉంటుందని వేదిక మీదే చెప్పేసింది. అంతేకాకుండా విఘ్నేష్‌ను పిలిచి మీరు అవార్డును అందించాలని సూచించింది. దాంతో అల్లు అర్జున్ చాలా హుందాగా, గౌరవంగా తప్పుకొన్నారు. ఆ తర్వాత తన కాబోయే భర్త నుంచి అవార్డు స్వీకరించారు.
అయితే నయనతార చేసిన పనిని సినీ వర్గాలతోపాటు నెటిజన్లు తప్పుపట్టారు. ఆ తర్వాత ఆమెతో కొందరు తెలుగు యువ హీరోలు నటించడానికి విముఖత చూపించారు. దాంతో ఆమె కేవలం సీనియర్ హీరోలతోనే నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత నయన్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుండటంతో ఆమె నటించడానికి ఉత్సాహం చూపించలేకపోయారు అనే అభిప్రాయం ఉంది.
ఇదిలా ఉండగా, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో తన సత్తాను చాటుకొన్న అందాల భామ ఇటీవల బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టారు. బాద్షా షారుక్ ఖాన్‌తో కలిసి ఆమె జవాన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో హిందీలో కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె ఆచీతూచీ సినిమాలు ఎంపిక చేసుకొంటున్నది. ఆమె ప్రస్తుతం మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, తని ఓరువన్ 2, మూక్తి అమ్మన్ చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











