Acharya 2: దేవర మూవీ ఆచార్య2? కొరటాల, ఎన్టీఆర్ కక్ష కట్టి టార్గెట్ చేస్తున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 ఏళ్ల తర్వాత తారక్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. ఇక ఆచార్య డిజాస్టర్ తర్వాత సినిమా కావడంతో హిట్ ఇస్తారనే నమ్మకం కొరటాల శివపై రెండితలు పెరిగింది. అయితే దేవర సినిమా చూసిన తర్వాత పూర్తిగా డివైడ్ టాక్ నెలకొన్నది. అయితే ఈ సినిమాపై ఓ వర్గం పని కట్టుకొని ట్రోల్ చేస్తుందనే టాక్ ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోను కనిపిస్తున్నది. ఎన్టీఆర్, తారక్‌ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారనే విషయంలోకి వెళితే..
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీ మినహాయిస్తే.. ఎన్టీఆర్ నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 2018 అక్టోబర్ 11 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ 6 సంవత్సరాల దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే దేవర సినిమాపై భారీ అంచనాలతో వచ్చిన ప్రేక్షకులకు కొన్ని మూమెంట్స్ మంచి అనుభూతి అందిస్తే.. మరికొంత మందికి ఈ సినిమా నిరాశపరిచింది. అందుకు కారణం సినిమాను సాగదీసి సాగదీసి చెప్పడమే అనే కామెంట్ వినిపిస్తున్నది. కానీ ఈ సినిమాకు టెక్నికల్ విషయాలు, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం బలంగా మారింది.
అయితే దేవరపై యంగ్ టైగర్ అభిమానుల్లో ఓ వర్గం అసంతృప్తికి గురవుతున్నది. ఈ సినిమాను రెండు పార్టులు చేయాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. జాన్వీ కపూర్‌కు స్క్రీన్ స్పేస్ లేకపోవడం మరింత నిరాశకు గురిచేసింది. కథ విషయంలో దర్శకుడు కొరటాల శివ ప్లానింగ్ లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దేవర సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు సందిగ్దంలో పడిపోయారు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుధ్ వర్క్ చూసిన తర్వాత బాగుందని, కొరటాల టేకింగ్ చూసి బాగలేదని కామెంట్ చేస్తున్నారు. అయితే అయితై హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం గొంతు చించుకొని కాలర్ ఎగురేసుకొనే పరిస్థితుల్లో లేదనే విషయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌పై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉండటం, అలాగే ఆచార్య వివాదంతో కొరటాల శివపై అసహనంతో ఉన్న మెగా అభిమానులు ఈ సినిమాను మరో ఆచార్య అంటూ Acharya2 అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే సినిమాను ఎన్టీఆర్ ప్రాణం పెట్టి చేసినా? ఇలా కక్ష్ కట్టారనే విషయంపై


Click it and Unblock the Notifications











