ఎన్టీఆర్ సినిమా టైటిల్ డ్రాగన్ కాదా? ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఏంటీ?

NTR- Prashant Neel: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'డ్రాగన్ (Dragon)'. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీపై సినీ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో 'కాంతార' బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేరాయి. అయితే, ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు 'డ్రాగన్' అనే పేరు ఫైనల్ కాలేదని నిర్మాతలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ సినిమా టైటిల్ డ్రాగన్ కాదా? ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఏంటీ?

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NTR31. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ 'డ్రాగన్' అనే పేరు పెట్టారు. ఈ సినిమా 2024 చివర్లో అధికారికంగా అనౌన్స్ అయినప్పటికీ, ప్రిత్విరాజ్ సుకుమారన్, రాజమౌళి వంటి వాళ్లు 'డ్రాగన్' అని పలు సందర్భాల్లో ప్రస్తావించడంతో ఆ పేరే ఫైనల్ అన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తుందని ఇండస్ట్రీలో గట్టి నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ టైటిల్ ఫైనల్ కాలేదని నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.

Is NTR -Prashanth Neel s Next Film Really Titled Dragon Mythri Ravi Breaks the Silence

తాజాగా నిర్మాత మైత్రి రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'' 'డ్రాగన్' కేవలం టెంటేటివ్ టైటిల్స్‌లో ఒకటి మాత్రమే. ఇంకా చాలా ఆప్షన్స్ పరిశీలిస్తున్నాం. మూవీ స్కేల్, ఎన్టీఆర్ క్యారెక్టర్ డిమాండ్‌కు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయి టైటిల్ ఫిక్స్ చేస్తాం" అని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఆఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆఫ్రికాలో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది ఒక యూనివర్సల్ బ్లాక్‌బస్టర్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు మూవీ నిర్మాతల కామెంట్స్ తో ఇంతకీ సినిమా టైటిల్ ఏంటీ? అనే చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో ఏ విషయం దాచాలని ప్రయత్నించినా.. బయటపడకుండా కాపాడటం చాలా కష్టం. ముఖ్యంగా మూవీ అప్టేడ్స్, టైటిల్స్‌ విషయంలో మూవీ మేకర్స్ ఎంత జాగ్రత్త పడినా.. ఎప్పుడో ఒక్కసారి బయటపడుతునే ఉంటాయి. గతంలో కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబో మూవీ ఆచార్య సినిమా టైటిల్‌ను, అధికారికంగా ప్రకటించే ముందే చిరంజీవి స్వయంగా ఒక ఈవెంట్‌లో పొరపాటున బయటపెట్టారు. వెంటనే సారీ చెప్పినా, అప్పటినుంచి "మెగా లీక్స్" అనే పదం ఇండస్ట్రీలో బాగా ప్రాచుర్యం పొందింది.

అలానే దిల్ రాజు- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ 'రౌడీ జనార్ధన్' అని టైటిల్ చెప్పేసారు. అప్పటివరకు ఆ సినిమా టైటిల్ ఎవరికి తెలియకపోయినా, స్వయంగా దిల్ రాజ్ నోట రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి 'డ్రాగన్' అనే పేరు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జోరుగా సాగుతోంది.ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అయ్యారు.

ఈ తరుణంలో సినిమా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ రవి.. డ్రాగన్ అనేది ఫిక్స్ అయిన టైటిల్ కాదు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా మాత్రమే వాడుతున్నామని, భవిష్యత్తులో పేరు మారే అవకాశం ఉందని చేసిన కామెంట్స్ చర్చనీయంగా మారాయి. ఇప్పటికే అభిమానులు, మీడియా డ్రాగన్ అనే పేరును మనసులో దింపేశారు. అలాంటి పరిస్థితిలో టైటిల్‌ మళ్లీ మార్చగలరా? అన్న సందేహం వ్యక్తం అవుతుంది. ప్రజల్లోకి వెళ్లిన పేరు తిరిగి మార్చడం నిర్మాతలకే పెద్ద సవాలు అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X