‘పారడైజ్’పై షాకింగ్ వార్త.. అది లేదనడంతో నాని సీరియస్
నేచురల్ స్టార్ నాని నుంచి నెక్ట్స్ రాబోతున్న చిత్రం 'పారడైజ్'. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా వదిలిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం నాని అభిమానులనే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఇప్పటికే 'దసరా' చిత్రం వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పారడైజ్ సినిమాపై మరింతగా అంచనాలు నెలకొన్నాయి.
దసరా చిత్రంతో నాని -శ్రీకాంత్ ఓదెల బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపారు. రూ.65 కోట్లతో రూపుదిద్దుకున్న ఆ చిత్రం ఏకంగా రూ.121 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ లో హ్యయేస్ట్ బడ్జెట్ తో చిత్రం రూపుదిద్దుకోనునండటంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలా సినిమాపై అంతకంతకు హైప్ పెరుగుతున్న క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

పారడైజ్ చిత్రానికి బడ్జెట్ లోటు కారణంగా ఏకంగా సినిమానే ఆపేశారంటూ ఫేక్ న్యూస్ ను కొందరు వ్యాప్తి చేశారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ద్వారా కూడా వీడియో విడుదలైంది. ఈ విషయం తెలుసుకున్న నాని చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక వెంటనే నాని టీమ్ ఇలా స్పందించింది. 'ఈ మధ్య సినిమాలపై పుకార్లు పుట్టించడం చాలా ఎక్కువైంది. ది పారడైజ్ పైనా షాకింగ్ రూమర్స్ ను కొందరు జోకర్ గాళ్లు కావాలనే వ్యాప్తి చేస్తున్నారని టీమ్ స్పందించింది. బడ్జెట్ లేకపోవడంతో సినిమాను ఆపేశారంటూ ఓ జోకర్ నాకొడుకు ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేశాడని మండిపడ్డారు. అలాంటి వారికి తమ సినిమాతోనే సమాధానం చెప్పబోతున్నామని, అలా అని వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఇటీవల సినిమాలకు సంబంధించిన పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడంలో కంటే కొందరు కావాల్చుకొని నెగెటివిటీని వ్యాప్తి చెందుతున్నారు. మరికొందరైతే డబులిస్తే చాలు సినిమాను, ఆర్టిస్టుల భవిష్యత్ లను నిర్ణయించేలా పనిచేస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇక ఎంతో మంది యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్న నాని సినిమాపై ఇలాంటి రూమర్ ను క్రియేట్ చేయడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ తో హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మా త చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రంలో నాని ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియెన్స్ ఊహించని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. 1980 కాలంలో సికింద్రాబాద్లో నివాసం ఉండిన ఓ నిరక్షరాస్యులు, మార్జినలైజ్డ్ ట్రైబల్ గ్రూప్ గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











