3 సినిమాలతో పవన్ కల్యాణ్ ఆపేస్తున్నాడా? మరి ఆ మూడు సినిమాల పరిస్థితి ఏమిటి?
సినిమా నుంచి వచ్చి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యిన వారిలో చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉంటారు. అయితే అప్పట్లో సోషల్ మీడియాలో యుగం లాంటివి ఏవి లేనప్పుడు అశేషమైన ప్రధారణ కలిగిన దిగ్గజ తారలు రాజకీయాల్లోకి వెళ్లి మొదటి అటెంప్ట్ లోనే హిట్ అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అందుకే వాటిని తట్టుకోలేక చిరంజీవి, రజినీకాంత్ లాంటి తారలే మనకొద్దు ఈ కుళ్ళు రాజకీయాలు అని తప్పుకున్నారు.
కానీ ఒక్కడు నిలబడ్డాడు. ఎన్నో అవమానాలు, ఓటములు చూసి కూడా మొండిగా నిలబడి తాను కోరుకున్న మార్పు దిశగా వెళుతున్నాడు.. ఆ ఒక్కడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల పరంగా తెచ్చుకున్న పవర్ స్టార్ అనే ట్యాగ్ ని రాజకీయాల్లో కూడా కూడా నిజం చేసి రియల్ పవర్ స్టార్ అయ్యాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ మరి తనకి అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఇక కొనసాగడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఇప్పుడు రాజకీయాల్లో ఎలాగో పవన్ సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఓకే చేసిన కేవలం మూడు సినిమాలు మాత్రమే తన నుంచి వస్తాయా అని అభిమానుల్లో ఎక్కడో కొంచెం బాధ అయితే లేకపోలేదు. ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి అనేది పక్కన పెడితే పవన్ ని లేట్ అయినా పర్వాలేదు రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా చూడాలి అనుకునేవారు చాలా మందే కోరుకుంటున్నారు.
మరి ఇక అది కేవలం మూడు సినిమాలకే పరిమితమా అంటే డెఫినెట్ గా కాదనే చెప్పాలి. పవన్ నుంచి ఖచ్చితంగా మూడు సినిమాలు కాదు ఏకంగా మొత్తం 6 సినిమాలు రావడం పక్కా అని చెప్పాలి. కాగా ఇపుడు పవన్ ఆల్రెడీ సెట్స్ మీద ఉంచిన సినిమాలు మూడు వరుసగా హరిహర వీరమల్లు, OG, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ఫినిష్ చేయాల్సి ఉంది. ఆ చిత్రంలని జ్యోతి కృష్ణ, సుజీత్, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరి మిగతా మూడు సినిమాలు ఏవంటే పవన్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా ఖచ్చితంగా ఉందని మొన్ననే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇది నాలుగోది. ఇక ఐదు, ఆరు సినిమాలు ఏవంటే ఇప్పుడు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల్లో రెండిటికి అధికారికంగా సీక్వెల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. హరిహర వీరమల్లు కి పార్ట్ 2 ఉంది.
అలాగే OG సినిమాకి కూడా రెండో భాగం ఉంది. ఇలా మొత్తంగా అయితే పవన్ నుంచి ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలు కాకుండా అదనంగా మరో మూడు సినిమాలు డెఫినెట్ గా ఉన్నాయి. సో పవన్ ఫ్యాన్స్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే అనే బాధ ఇక ఉండక్కర్లేదు. కాకపోతే అసలు పాయింట్ ఏమిటంటే అసలు ఈ సినిమాలు ఎపుడు మొదలవుతాయి పవన్ కి ఉన్న బిజీ లైఫ్ లో ఎలా పూర్తవుతాయి అనేది ముఖ్య ప్రశ్న. సో ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అనేది మాత్రం పవన్ చేతుల్లోనే ఉంది.


Click it and Unblock the Notifications











