పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర?.. ఇంటి వద్ద రెక్కీ..వాహనాన్ని వెంబడించి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఇంకా ఏడాదికిపైగా ఉన్నప్పటికీ.. రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైజాగ్‌లో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పర్యటన వివాదాస్పదమైన తర్వాత జనసేన, అధికార పార్టీ మధ్య వాదనలు, అభిప్రాయ బేధాలు, విమర్శనాస్త్రాలు జోరందుకొన్నాయి. అయితే ఇలాంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

జనవాణి కోసం పవన్ కల్యాణ్

జనవాణి కోసం పవన్ కల్యాణ్


గతనెల జనవాణి పర్యటన కోసం పవన్ కల్యాణ్ వైజాగ్‌కు చేరుకొనే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. పవన్ కల్యాణ్‌ ర్యాలీ కొనసాగుతున్న సమయంలో వీధి దీపాలు ఆర్పివేశారు. చీకట్లోనే పవన్ ర్యాలీని కొనసాగించడం.. పోలీసులు అధికారులు బెదిరింపులకు పాల్పడటం తెలిసిందే..

వైజాగ్ హోటల్‌లో దిగ్బంధం

వైజాగ్ హోటల్‌లో దిగ్బంధం


వైజాగ్‌లోని ప్రముఖ హోటల్‌లో పవన్ కల్యాణ్‌ను దిగ్బంధం చేయడం మరింత వివాదాస్పదమైంది. రెండు రోజులపాటు కొనసాగిన ఉద్రిక్తతలు రాజకీయంగా వేడిని పుట్టించింది. అరెస్టైన తమ కార్యకర్తలను బెయిల్‌పై విడిపించుకొన్న తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడకు తిరిగి వచ్చారు.

ఇళ్ల వద్ద రెక్కీ

ఇళ్ల వద్ద రెక్కీ


అయితే వైజాగ్ ఘటన తర్వాత పవన్ కల్యాణ్, అలాగే మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించారు. పవన్, నాదెండ్ల కారును కొందరు గుర్తు తెలియని అగంతకులు వెంబడిస్తున్నారు అని జనసేన నేతలు ఆరోపించారు. అయితే పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కొందరు సెక్యూరిటీతో గొడవ పడటం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందనే వాదన తెరపైకి వచ్చింది.

పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా

పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా


పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకొని నిర్వహించిన రెక్కీకి సంబంధించిన వీడియోలను, ఫోటోలను జనసేన నేతలు పోలీసులకు అందజేశారు. వైజాగ్ ఘటన తర్వాత ఇలాంటి సంఘటనలు, అనుమానస్పద రీతిలో పార్టీ కార్యాలయం, పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కొందరు అగంతకులు కనిపించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జూబ్లీహిల్ల్స్ పోలీస్ స్టేషన్‌లో

జూబ్లీహిల్ల్స్ పోలీస్ స్టేషన్‌లో


వైజాగ్ సంఘటన తర్వాత తన కారును కొందరు అనుమానాస్పద రీతిలో వెంబడిస్తున్నారు అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ.. జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్ గౌడ్ జూబ్లీహిల్ల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద సీసీ టీవీ ఫుటేజ్, పార్టీ కార్యాలయం వద్ద వీడియోలు, ఫోటోలు పోలీసులకు సమర్పించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X