గబ్బర్ సింగ్ సెంటిమెంట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్.. ఓజీని మించి పవన్ కల్యాణ్ మూవీ
గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో తమకు భారీ బ్లాక్ బస్టర్ అందించిన గబ్బర్ సింగ్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారనే విషయం అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ సినిమా గురించిన ఆ సెంటిమెంట్ వివరాల్లోకి వెళితే..
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇటీవలే పవన్ కల్యాణ్‌కు అన్ని సీన్స్‌కు సంబంధించిన షూట్‌ను పూర్తి చేసుకొన్నారు. అలాగే ఈ సినిమా పాటలను కూడా పూర్తి చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ కోసం భారీగా ప్లానింగ్ కూడా జరుగుతున్నది. ఈ చిత్రం విడుదలను ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గించకుండా ప్లాన్ చేస్తున్నాం అని నిర్మాత రవి శంకర్ తాజాగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

డ్యూడ్ సినిమా ఈవెంట్‌లో నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను శివరాత్రికి రిలీజ్ చేయాలా? వద్దా అనే విషయం క్లారిటీ లేదు. ఇంకా ఏమీ అనుకోలేదు. కల్యాణ్ గారి షూట్ పూర్తయింది. మిగితా 25 రోజుల షూట్ ఉంది. మళ్లీ ప్రెష్ షెడ్యూల్ మొదలైంది. ఈ షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాం. ఈ సినిమాను సమ్మర్‌లోనే మంచి డేట్‌కు రిలీజ్ చేస్తాం అని అన్నారు.
అయితే ఉస్తాద్ గబ్బర్ సింగ్ విషయంలో గబ్బర్ సింగ్ మూవీని ఫాలో అయ్యే అవకాశం ఉంది. 2012 సంవత్సరంలో గబ్బర్ సింగ్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాను అప్పట్లో మే రెండో వారంలో రిలీజ్ చేసి విజయం సాధించారు. అయితే మే 2వ వారంలో రిలీజ్ కావడం విజయం సాధించడం సెంటిమెంట్‌గా కనిపిస్తున్నది. అయితే గబ్బర్ సింగ్ సినిమా సెంటిమెంట్ ఫాలో అయి ఉస్తాద్ భగత్ సింగ్‌ను కూడా మే రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని వేసవి సెలవుల టార్గెట్‌గా రిలీజ్ చేస్తే పిల్లలు, ఫ్యామిలీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో భారీగా విజయమే కాకుండా బ్లాక్ బస్టర్ సినిమాగా మారే ఛాన్స్ ఉంది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మైత్రీ మూవీ మేకర్స్ ఈ సమ్మర్ టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాంకేతిక అంశాల విషయానికి వస్తే..దశరథ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అయాంక బోస్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ చోటా కే ప్రసాద్, సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌గా రూపొందింది. ఈ సినిమాకు ఇప్పటి నుంచే భారీగా బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











