Allu Vs Mega : రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్.. అల్లు బ్రదర్స్‌లో చిచ్చు పెట్టిందా?
పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ అయ్యిన సౌత్ చిత్రాల్లో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "గాయ పడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది" అని. మరి ఈ డైలాగ్ కి ఇపుడు పర్ఫెక్ట్ యాప్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం చెప్పవచ్చు.
కాగా రామ్ చరణ్ హీరోగా ఇపుడు చేస్తున్న బిగ్గెస్ట్ సినిమానే "పెద్ది". కేవలం ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అదే పెద్ది ఫస్ట్ షాట్ చూసి అందరికీ ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి ఈ రేంజ్ లో ఎవరూ ఊహించలేదు.

అందుకే కేజీఎఫ్ డైలాగ్ తనకి పర్ఫెక్ట్ గా ఇపుడు సెట్ అవుతుంది అనేది. కాగా ఈ ఫస్ట్ షాట్ చూసాక పాన్ ఇండియా లెవెల్లో ట్రెండింగ్ గా మారిపోయిన ఈ గ్లింప్స్ చూసి తెలుగు నుంచి కూడా అనేకమంది హీరోస్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఇపుడు ఈ గ్లింప్స్ నే అల్లు హీరోస్ నడుమ చిచ్చు పెట్టిందా అనే టాక్ సోషల్ మీడియాలో మళ్ళీ అల్లు వర్సెస్ మెగా అభిమానుల నడుమ రచ్చకి దారి తీసింది.
కాగా పెద్ది ఫస్ట్ షాట్ ఇలా వచ్చిందో లేదో దానిపై అల్లు వారి హీరోస్ లో ఒకడైన అల్లు శిరీష్ చాలా ఎగ్జైటెడ్ గా దాని కోసం చెప్పడం జరిగింది. కాగా ఈ గ్లింప్స్ కి అల్లు శిరీష్ ఈ రేంజ్ లో రెస్పాండ్ అవ్వడం తన అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నచ్చలేదట. అందుకే అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ లో తన సొంత సోదరుడిని అన్ ఫాలో కొట్టేసాడు అంటూ పలు పోస్ట్ లు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఈ సినిమా గ్లింప్స్ అల్లు హీరోస్ నడుమ చిచ్చు పెట్టిందా అనే మాట ఇపుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ మధ్య కాలంలో రెండు కుటుంబాల నడుమ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. దీనితో పలు ఫేక్ పోస్ట్ లు కూడా వేసుకుంటున్నారు. కాగా ఇపుడు శిరీష్ అలా చెప్పినందుకు రామ్ చరణ్ ఈరోజు నుంచి సోషల్ మీడియాలో శిరీష్ ని ఫాలో అవుతున్నాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇందుకు కౌంటర్లు ఇస్తున్నారు.
ఇలా మొత్తానికి మాత్రం సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు అభిమానుల గొడవలు మాత్రం సదరు వారి హీరోలే వచ్చి చెప్పినా కూడా ఆగేలా లేవని చెప్పక తప్పదు. ఇక ఈ భారీ సినిమాలో శివ రాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యెందు శర్మ తదితరులు నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమాని మార్చ్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











