పేరు మార్చుకొన్న ప్రభాస్.. కొత్త పేరేంటో తెలుసా? కల్కి మేనియాలో అసలు పట్టించుకోలేదేంటి?
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు నమ్మే విభాగాలు, జనాలు ఎక్కువ. తన సినిమాలో ఒక నటీ లేదా నటుడి ఉండటాన్ని అదృష్టంగా భావించేవాళ్లు ఎందరో. అలాగే తమ సినిమాల్లో పేరు ఇలా ఉంటేనే హిట్ అవుతుందని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ఇక శుభ శకునాలు, ముహూర్తాల సంగతి సరేసరి. కానీ ఎవరేం చేసినా, ఏ సెంటిమెంట్ ఫాలో అయినా అంతిమంగా కావాల్సింది విజయం. ఎందుకంటే చిత్ర పరిశ్రమ సక్సెస్ వెంట నడుస్తుంది... సక్సెస్ కొట్టినవాళ్ల వెంటే పరుగులు తీస్తుంది. ఇది ఇప్పటిది కాదు .. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇంతే. గెలిచినవాళ్లే ఇండస్ట్రీలో ఉంటారు.. గెలవని వారికి ఇక్కడ స్థానం కష్టం. కఠినంగా ఉన్నా సరే ఈ మాట వాస్తవం.
ఈ సంగతి పక్కనబెడితే.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 ఏడీ. గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే తదితరుల నటనతో పాటు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ కల్కిని మరోస్థాయిలో నిలబెట్టాయి.

3 గంటల పైనే ఉన్నప్పటికీ ప్రేక్షకుడు కుర్చీలోంచి కదల్లేదంటే నాగ్ అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో చెప్పనక్కర్లేదు. భారతీయులు తలచుకుంటే హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ , సూపర్ హీరో మూవీస్ తీయడం పెద్ద కష్టం కాదని నాగ్ అశ్విన్ నిరూపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎస్ఎస్ రాజమౌళి తర్వాత మరో మెట్టెక్కించారు నాగ్ అశ్విన్.
రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా కల్కి .. విడుదలైన తర్వాత కూడా తన హవా కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాలను నిజం చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీ సేల్ బుకింగ్స్‌లో రికార్డులను నెలకొల్పింది. ప్రీమయర్స్ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
ప్రీమియర్స్ విషయంలో రాజమౌళి గత చిత్రం ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను (3.46 మిలియన్లు) కల్కి అధిగమించింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్‌తో కలిపి అమెరికాలో కల్కి 2898 ఏడీ దాదాపు 5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. లాంగ్ వీకెండ్ కావడంతో కల్కి వసూళ్లు సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్ నటన హైలైట్‌గా నిలిచిందని అభిమానులు, విమర్శలు ప్రశంసిస్తున్నారు. తన కటౌట్‌కి తగ్గ పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అలాగే తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు. అయితే కల్కి మేనియాతో ఓ విషయం మరుగున పడిపోయినట్లుగా అనిపిస్తోంది. అదేంటంటే ప్రభాస్ పేరుతో చిన్న మార్పు కనిపిస్తోంది. టైటిల్స్ కార్డులో ప్రభాస్‌కి బదులు ''శ్రీ ప్రభాస్ '' అని పడింది.
అయితే దీనిని మేకర్స్ ఆయనకు గౌరవ సూచికంగా శ్రీ అని పెట్టారా, లేదంటే న్యూమరాలజీ, జాతకాన్ని అనుసరించి ప్రభాస్ సూచన మేరకు ఆయన పేరుకు ముందు శ్రీ అని వేశారా అనేది తెలియరాలేదు. అయితే ప్రభాస్ నటించిన మరో సినిమా రిలీజైతేనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. కానీ డార్లింగ్ అభిమానులు ప్రస్తుతం ఇవేవీ పట్టించుకునే మూడ్‌లో లేరు. కల్కి వారిని అంతంగా కమ్మేసింది మరి.


Click it and Unblock the Notifications











