కల్కిలో ప్రభాస్‌పై ఆ స్టార్ హీరోలు డామినేషన్? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో?

ఇప్పుడు పాన్ ఇండియా వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898 ఎడి ఒకటే ఉందని చెప్పాలి. టాలీవుడ్ సహా సౌత్ నుంచి కూడా చాలా కాలం తర్వాత వస్తున్నా భారీ సినిమా ఇదే కావడంతో దీనిపై మంచి ఆసక్తి చాలా మందిలో నెలకొంది.

కాగా ఈ సినిమాని పురాణాలూ, సైన్స్ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. కాగా తాను అవ్వడానికి యంగ్ అయినప్పటికీ తన విజన్ మాత్రం ప్రపంచ స్థాయి ఆడియెన్స్ ని రీచ్ అయ్యే లెవెల్లో ఉన్నట్టుగా ట్రైలర్స్ చూస్తే క్లియర్ గా అర్ధం అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ లో హీరో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కాస్త తక్కువ చేసి చూపించాడని ఈ సినిమా విషయంలో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

is prabhas dominated by Kamal Haasan and Amitabh Bachchan in kalki 2898 AD

అసలు ప్రభాస్ లేనిదే కల్కి సినిమా లేదు అనే స్టేజి నుంచి ఈ సినిమాలో ప్రభాస్ పాత్రని మరో రెండు పాత్రలు డామినేట్ చేస్తాయనేది అనేది క్లియర్ గా చూపిస్తున్నారు. ఇంతకీ ఆ పాత్రలు ఎవరివో కాదు. సీనియర్ నటులు బాలీవుడ్ దిగ్గజం అశ్వత్తామ అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్ స్టార్ కమల్ హాసన్. కాగా ఫస్ట్ ట్రైలర్ నుంచి నిన్న వచ్చిన రెండో ట్రైలర్ లో కూడా ప్రభాస్ ని మించే అశ్వతాముడు కనిపిస్తున్నాడు. దీనితో అమితాబ్ పాత్రపై అందరిలో ఒకరకమైన ఎగ్జైట్మెంట్ ఏర్పడింది.

దీనితో అలాంటి ప్రభాస్ పాత్రనే డామినేట్ చేసేలా అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకొని సినిమా చూస్తారా అనేది ప్రశ్న. ఈ విషయంలో మాత్రం మొత్తం భారం అంతా కూడా నాగి మీదే ఉందని చెప్పి తీరాలి. ఏ అభిమాని కూడా తమ హీరోని తక్కువ చేసి చూడాలి అనుకోడు మరి అమితాబ్ పాత్రని బాగా హైలైట్ చేసి ప్రభాస్ రోల్ ని చిన్నబోస్తే ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి మాత్రం అక్షింతలు తప్పవనే చెప్పాలి.

is prabhas dominated by Kamal Haasan and Amitabh Bachchan in kalki 2898 AD

మరి అసలు నాగ్ అశ్విన్ ఏం చేసాడో తెలియాలి అంటే ఈ జూన్ 27 వరకు ఆగాల్సిందే సుమీ.. ఇక ఈ సినిమాలో వీరితో పాటుగా కమల్ హాసన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండగా దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, మాల్వికా నైర్ తదితరులు నటించారు.

అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వర్క్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని ఇండియా లోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిర్మాణం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అని చాలా మందే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X