Kalki 2898 AD ఆ హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టరా? కల్కి ట్రైలర్ లో ఇవి గమనించారా?
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'కల్కి 2898 ఏడీ ' . మొదలుపెట్టిన నాటి నుంచి విజువల్ వండర్‌గా నేషనల్ వైడ్ హైప్‌ను సొంతం చేసుకుంది కల్కి. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ స్టాండర్డ్స్ ఈ సినిమాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేశాయి. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తోన్న కల్కి 2898 ఏడీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రలు పోషిస్తుండగా.. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నారు. హాలీవుడ్ మార్క్ సైన్స్ ఫిక్సన్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా కల్కిని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాకు కొన్ని హాలీవుడ్ సినిమాలను నాగ్ అశ్విన్ ప్రేరణగా తీసుకున్నారంటూ సోషల్ మీడియా జనాలు స్క్రీన్ షాట్లతో సహా నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. మరి అవేంటో ఒకసారి గమనిస్తే.

ట్రైలర్‌లోని మెట్రోపాలిటిన్ సిటీలోని ఎత్తైన భవనాలు 2019లో రాబర్ట్ రోడ్రిగ్జ్ తెరకెక్కించిన స్కై సిటీ ఆఫ్ జాలెమ్‌ను గుర్తుకు తెస్తుంది. ఈ చిత్ర ట్రైలర్‌లో ప్రపంచాన్ని శాసించే దుష్ట సమాజాన్ని నిర్మూలించే మెస్సియానిక్ వ్యక్తిని (డూన్‌లోని పాల్ అట్రిడెస్ మాదిరిగా) సూచించింది. ఏది ఏమైనప్పటికీ అశ్వత్థామ.. స్టిల్గర్ (డూన్‌లోని జేవియర్ బార్డెమ్ ఫ్రీమెన్ తెగ నాయకుడు) లాగా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ అశ్వత్థామే దుష్టులను నిర్మూలించేలా కల్కికి శిక్షణ ఇస్తాడట.
స్టార్ వార్స్‌లో గెలాక్సీ సామ్రాజ్యాన్ని హై సొసైటీ నుంచి స్వాధీనం చేసుకోవడం, ఆ సమయంలో పోరాట సన్నివేశాలు జనాన్ని కట్టిపడేశాయి. కల్కి 2898 ఏడీలోనూ ఇలాంటి మనుషులు, సిటీ కాంప్లెక్స్‌లోని అందాలు.. కాశీ నగరం వెలుపల ఉన్న మట్టి దిబ్బలు సమాజంలోని అంతరాలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. ప్రభాస్ బైరవ క్యారెక్టర్ సైతం కొన్ని హాలీవుడ్ సూపర్ హీరోలను స్పూర్తిగా తీసుకుని నాగ్ అశ్విన్ మలిచినట్లుగా కనిపిస్తోంది. ది మ్యాట్రిక్స్ లోని నియో, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ లోని స్టార్ లార్డ్, అవతార్ లోని జేక్ సుల్లీ, ఆయిరతిల్ ఒరువన్ లోని కార్తీ ముత్తు మచ్చుకు కొన్ని.

ఇలాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో భవిష్యత్తులో కరెన్సీ ఉండదని జనానికి చెప్పేందుకు యూనిట్లు అనే పదాన్ని వాడతారు. స్టార్ వార్స్, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ, రెడీ ప్లేయర్ వన్, బ్లేడ్ రన్నర్ చిత్రాల్లో యూనిట్లు ఇందుకు మంచి ఉదాహరణ. ఈ చిత్రాల మాదిరిగానే కల్కి ట్రైలర్‌లో ప్రభాస్ కరెన్సీకి బదులుగా యూనిట్లను ప్రస్తావించడాన్ని గమనించవచ్చు. ట్రైలర్‌లోని మొదటి షాట్ వార్ రిగ్ లాంటి హెవీ డ్యూటీ కారు ఎడారి గుండా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రేమ్ చూస్తే జార్జ్ మిల్లర్ మరోసారి ఈ సీన్ తీశారా అన్న అనుమానం కలగకమానదు.
భైరవ నడిపే బుజ్జిని కూడా డార్క్ నైట్ లోని బ్యాట్ మొబైల్, బ్లేడ్ రన్నర్‌లోని ఎగిరే కారు స్పిన్నర్, ది ఎవెంజర్స్ లోని చిటౌరీ చారియట్స్.. స్టార్ వార్స్ లోని స్పీడర్ బైక్‌లను మైండ్‌లో పెట్టుకునే నాగ్ అశ్విన్ తయారు చేసి ఉండొచ్చు. సైన్స్ ఫిక్షన్ చిత్రాలంటే చాలు బ్లాస్టర్‌లు, ఎనర్జీ షీల్డ్‌లు, ఫ్లాస్మా రైఫిల్స్ షరా మామూలు అయిపోయాయి.

కల్కి 2898 ఏడీలోనూ స్టార్ వార్స్‌లోని రెడ్, బ్లూ కలర్ ఎనర్జీ బ్లాస్టర్‌లు రోలాండ్ ఎమ్మెరిక్ తీసిన ఇండిపెండెన్స్ డే మూవీలోని గ్రహంతర ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న కెనటిక్ ఎనర్జీ పవర్ షీల్డ్‌లను గుర్తుచేస్తున్నాయి. మొత్తానికి ఒక్క ట్రైలర్ చూస్తేనే ఇన్ని హాలీవుడ్ బొమ్మలు నెటిజన్ల బుర్రలోని సిల్వర్ స్క్రీన్‌పై మెదిలాయి. మరి జూన్ 27న సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్నీ సినిమాలు గుర్తుస్తోయో.


Click it and Unblock the Notifications











