ప్రభాస్ వదిలేశాడు.. రానా చేజిక్కించుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏంటో తెలుసా?
డెఫినెట్ గా ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన అలాగే ఇపుడు చే్తున్న టాప్ హీరోస్ లో అందరి డార్లింగ్ హీరో ప్రభాస్ పేరే ముందు ఉంటుంది అని చెప్పవచ్చు. క్రేజీ జానర్స్ ఎందులో అయినా ఇమిడిపోయే చరిష్మా ప్రభాస్ సొంతం అయితే ఇపుడు ఇండియా వైడ్ గా కూడా మోస్ట్ వాంటెడ్ హీరోగా ప్రభాస్ అందరి నిర్మాతలకి నిలిచాడు. ఇపుడు ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు అని వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
కాగా ఇలా ప్రభాస్ దాదాపు రానున్న ఐదారేళ్ళ బిజీ షెడ్యూల్ లో లాకయ్యి ఉన్నాడు. అయితే ఈ లైనప్ లో ప్రభాస్ ఒకే నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు చేయనున్నాడు. కాగా ఆ నిర్మాణ సంస్థే కేజీఎఫ్, ప్రభాస్ తో సలార్ లాంటి సెన్సేషనల్ సబ్జెక్టు తెరకెక్కించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు అని చెప్పాలి. కాగా ఆల్రెడీ సలార్ వీరితో చేయగా ఇంకో మూడు సినిమాల్లో సలార్ 2 కూడా ఒకటి.

అయితే మిగతా రెండూ మాత్రం మంచి సస్పెన్స్ గా నిలవగా ఈ చిత్రాల్లో ఒకటి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉంటుంది అని అది కూడా ప్రభాస్ మొట్ట మొదటిసారిగా ఒక పూర్తి నెగిటివ్ పాత్రలో కనిపిస్తాడని పలు క్రేజీ రూమర్స్ వచ్చాయి. సూపర్ హీరో జానర్ సినిమాలతో పెద్ద లైనప్ ని సెటప్ చేసుకున్న ప్రశాంత్ వర్మ అందులో భాగంగా ప్రభాస్ తో కూడా మాసివ్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నట్టు పుకార్లు వచ్చాయి.
కాగా ఇపుడు ఈ సినిమా నుంచే డార్లింగ్ హీరో తప్పుకున్నటుగా సినీ వర్గాల్లో చర్చగా మారింది. అయితే ఇంకో పక్క ఈ సినిమా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో అనుకున్న సినిమా ఇది అని ఈ సినిమా ప్రభాస్ సినిమా వేరు అన్నట్టుగా మరో వెర్షన్ వినిపిస్తుంది. కానీ రణ్వీర్ తో సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించాల్సి ఉంది.

ఇలా ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్ల ఈ రూమర్స్ కొనసాగుతున్న నేపథ్యంలో బ్రహ్మరాక్షస సినిమా లైన్ ోకి మాత్రం ఇపుడు ప్రభాస్ బాహుబలి విలన్ రానా దగ్గుబాటి లైన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా రానా ఈ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఓకే చెప్పేసాడు అంటూ కొత్త గాసిప్స్ మొదలయ్యాయి.
మరి ప్రభాస్ నిజంగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని వదులుకున్నాడా? రానా దగ్గరకే ఆ సబ్జెక్టు వెళ్లిందా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. అన్నట్టు రానా ఇదే సినిమా కాకుండా ఈ తరహా ప్రాజెక్ట్ "హిరణ్యకశిప" కూడా నౌన్స్ చేసి ఉన్నాడు. మరి చూడాలి ఈ సినిమాలో కూడా తాను ఉన్నాడా లేదా అనేది. ఇక ప్రభాస్ ఇపుడు దర్శకుడు మారుతీతో ది రాజా సాబ్ అలాగే మరిన్ని బిగ్ ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టుకొని రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











