Prabhas: ది రాజా సాబ్ స్టోరీ లైన్ లీక్.. ఆ రెండు సినిమాల కథ ఒకటేనా?

ఇప్పుడు ఇండియాన్ సినిమా దగ్గర ఫుల్ ఫామ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి తర్వాత వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ అండ్ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ ప్రభాస్ ఓ రేంజ్ హైప్ ని తెచ్చుకున్నాడు. అలా రీసెంట్ గా సెన్సేషనల్ చిత్రం "కల్కి 2898 ఎడి" తాను రిలీజ్ కి రాగా ఈ సినిమాతో తన గత చిత్రం సలార్ ని మించి వసూళ్లు రాబడుతున్నాడు.

కాగా ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి మరిన్ని క్రేజీ సినిమాలతో ఆసక్తికర లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ లైనప్ లో ప్రభాస్ చేస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమానే "ది రాజా సాబ్". దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదట్లో వచ్చిన నెగిటివిటీ అంతా ఇంతా కాదు. సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే వరకు అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై మినిమమ్ ఇంట్రెస్ట్ కూడా లేదు.

Is prabhas upcoming movie the raja saab story leaked online

ఎప్పుడైతే వింటేజ్ ప్రభాస్ ని తీసుకొస్తున్నాం అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసి హంగామా మొదలు పెట్టారో అప్పుడు ఈ సినిమాపై కొంచెం హైప్ వచ్చింది. కాగా ఈ సినిమా స్టోరీ అది ఇది అంటూ కొన్ని లైన్స్ కూడా ఆ మధ్య వైరల్ గా మారాయి. కాగా ఇప్పుడు ఓ సరికొత్త లైన్ ది రాజ్ సాబ్ సంబంధించి లీక్ అయ్యింది అని ఓ లైన్ వైరల్ గా మారింది.

ప్రముఖ మూవీ డేటా బేస్ సైట్ ఐఎండిబి లో పొందుపరిచిన మేటర్ ఏమిటంటే ఓ జంట విధిని, కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ ని ఎదుర్కోవడంలో నడిచే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలిపారు. దీనితో ఇదే లైన్ వైరల్ గా మారగా దీనికి ప్రభాస్ సన్నిహితుడు అలాగే దర్శకుడు మారుతికి కూడా స్నేహితుడు ఇంకా టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ కూడా అయినటువంటి ఎస్ కే ఎన్ కౌంటర్ ఇచ్చారు.

కాగా తాను మాట్లాడుతూ ఈ లైన్ కూడా సమె "రాధే శ్యామ్" లానే ఉంది కదా రెండు సినిమాలకి ఒకటే కథా? అంటూ రాజా సాబ్ విషయంలో లీక్ అయ్యిన లైన్ అబద్దం అన్నట్టు కొట్టి పారేసాడు. దీనితో ప్రభాస్ అభిమానులకి కొంచెం క్లారిటీ ఇపుడు వచ్చింది. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముచ్చటగా ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇక రాధే శ్యామ్ ఫేమ్ రిద్ధి కుమార్ లు నటిస్తున్నారు.

ఇటీవల కాలంలో ప్రభాస్ కెరీర్‌లో తక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ ద్వారా మాళవిక మోహనన్ ఈ సినిమా తోనే టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుంది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

More from Filmibeat

Read more about: prabhas maruthi the raja saab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X