తెలంగాణ అసెంబ్లీ బరిలో సెన్సేషనల్ నిర్మాత.. బీజేపీ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో పోటికి సిద్దం.. ఎక్కడ నుంచి అంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ, అధిష్టానం వ్యూహాలు రచిస్తున్నది. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన యువ నిర్మాతపై బీజేపీ దృష్టిపెట్టింది. ఆ నిర్మాత వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నది. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన, ప్యాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్న నిర్మాతను తెలంగాణ నుంచి పోటీకి సమాయత్తం చేస్తున్నది.

ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో

ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇటీవల ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. కశ్మీర్‌లో హిందువులపై మిలిటెంట్ల ఊచకోత నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రం రికార్డులకే కాకుండా వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది.

కార్తీకేయ 2 మూవీతో హిందూ ఎజెండా

కార్తీకేయ 2 మూవీతో హిందూ ఎజెండా

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ది కశ్మీర్ ఫైల్స్ సృష్టించిన ప్రకంపనలు సద్దుమణగక ముందే.. అభిషేక్ అగర్వాల్ మరోసారి హిందూ కాన్సెప్ట్‌తో రూపొందించిన కార్తీకేయ 2 చిత్రం సంచలన విజయం సాధించింది. కృష్ణతత్వంతో రూపొందించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డులను తిరగరాస్తూ... భారీ కలెక్షన్లను సాధించింది. ఇలా బీజేపీ ప్రభుత్వం విజన్‌కు తగినట్టుగా అభిషేక్ అగర్వాల్ తన సినిమాలతో ముందుకెళ్తున్నాడు.

హిందూ సంస్థలతో అనుబంధం

హిందూ సంస్థలతో అనుబంధం

ఇక అభిషేక్ అగర్వాల్ వ్యక్తిగత విషయానికి వస్తే.. విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్‌తో అనుబంధం ఉంది. హిందూ మత పరిరక్షణ సంస్థతో అనుబంధం, మూలాలు ఉండటంతో ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వం దృష్టిలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ అగ్ర నాయకత్వానికి అందుబాటులో కొనసాగుతున్నారు.

గ్రేటర్ పరిధిలో అభిషేక్ అగర్వాల్ పోటీ

గ్రేటర్ పరిధిలో అభిషేక్ అగర్వాల్ పోటీ

బీజేపీ, హిందూ సంస్థల ఎజెండాకు తగినట్టుగా తన సినిమాలతో దేశభక్తిని, హిందూ వ్యతిరేక ఎజెండా నేపథ్యంగా సినిమాలను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అభిషేక్ అగర్వాల్‌ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక స్థానం నుంచి అసెంబ్లీ బరిలో దించేందుకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తున్నది అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎక్కడ నుంచి పోటీ అంటే?

ఎక్కడ నుంచి పోటీ అంటే?

అయితే తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభిషేక్ అగర్వాల్ కూడా సిద్ధంగా ఉన్నారని, ఈ ఎన్నికల కోసం ఆయన సంసిద్ధం అవుతున్నట్టు తెలిసింది. అయితే హైదరాబాద్‌లో ఓ కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ స్థానానికి ఇతర నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో పార్టీ అధిష్టానం త్వరలోనే అభిషేక్‌ అగర్వాల్‌ను ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే నిర్ణయాన్ని తీసుకోనున్నదని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X