అల్లు Vs మెగా.. స్టార్ హీరో కోసం బన్నీని వదిలేసిన నిర్మాత?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా అల్లు అరవింద్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ టాలీవుడ్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించారు. ఇప్పటికీ అద్భుతమైన చిత్రాల నిర్మాణాలకు కృషి చేస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ.. యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ ముందుంటున్నారు. అయితే అల్లు అర్జున్ కు కుడి భుజంలా ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ నిర్మాత బన్నీ వాసు విడిపోయారంటూ ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం మొదలైంది. దీంట్లో వాస్తవం ఎంతుందనేది పక్కన పెడితే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అంచెలంచెలుగా ఎదుగుతున్న బన్నీ వాసు..
గీతా ఆర్ట్స్ లో ఎంప్లాయ్ గా జాయిన్ అయిన బన్నీ వాసు తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎంప్లాయియ్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం తనకు సినిమా నిర్మాణంలో ఉన్న అనుభవంతో సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను కూడా ప్రారంభించారు. అయితే మొన్నటి వరకు బన్నీ వాసు గీతా బ్యానర్ అండర్ లో నిర్మాతగా పలు చిత్రాలు చేశారు. డిస్ట్రిబ్యూట్ గా గుంటూరు, గోదావరి రీజియన్ లో పోకిరి, ఆర్య, మగధీర సినిమాలను రిలీజ్ చేశారు. ఇక నిర్మాతగా 100% లవ్, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మొగాడివో, గీతా గోవిందం, ప్రతి రోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కోట బొమ్మాళి పీఎస్, తండేల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు.

Is Producer Bunny Vasu Divided From Allu Aravind

బన్నీ వాసు కొత్త ప్రొడక్షన్ హౌజ్..
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాతగా సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తూ వచ్చారు బన్నీ వాస్. 10 ఏళ్లు తనకంటూ సొంత బ్యానర్ లేకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తూ వచ్చారు. 100 శాతం సక్సెస్ ను సాధించారు. ఇక ప్రస్తుతం బన్నీ వాసు తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించారు. బన్నీ వాస్ వర్స్ అని నామకరణం చేశారు. ఈ విషయంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా ఆయన్ని అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది.

అల్లు వర్సెస్ మెగా.. బన్నీ వాసు నెక్ట్స్ మూవ్..
మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయంటూ ఆయా సందర్భాల్లో వార్తలు పుట్టగొడుగుల్లా వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా సమయంలోనూ ఈ విషయం బయట పడింది. ఇదిలా ఉంటే.. తాజా బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు పూర్తిగా చేరిపోవడం కోసం అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నుంచి బయటికి వచ్చారని సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. మరికొందరు దీనిలో వాస్తవం లేదని అంటున్నారు.

బన్నీ వాసుపై అల్లు అర్జున్ ప్రశంసలు..
గీతా ఆర్ట్స్ లో ఎంతో కాలంగా తమకు నమ్మకంగా ఉంటూ బన్నీ వాస్ పని చేశారని అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో సినిమా ఈవెంట్లలో చెప్పారు. బన్నీ వాస్ మంచి తనాన్ని పొగిడారు. అలాంటి అల్లు అర్జున్, అల్లు అరవింద్ ను వీడి బన్నీ వెళ్లిపోతారా? అనే రూమర్లలో వాస్తవం ఎంత ఉందనేది వేచి చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ 2023లో తన పార్టీ ప్రచార కార్యక్రమాల బాధ్యతలను బన్నీ వాస్ కు అప్పగించారు. ఇక రీసెంట్ గా ప్లీనరీ ఏర్పాట్లలో ఆయన సందడి చేయడం మూలంగా ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun bunny vas pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X