పవన్ కల్యాణ్‌పై దిల్ రాజు కంప్లయింట్.. అల్లు అర్జున్ మాత్రమే బ్రాండ్.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల జనసేన టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో వైసీపీలో చేరిన తర్వాత తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశం పెట్టి.. పవర్ స్టార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..

మెగా ఫ్యామిలీలోని హీరో అల్లు అర్జున్ గురించి మీరెప్పుడైనా నాలుగు మంచి మాటలు చెప్పారా? ఇండస్ట్రీకి మేమే బ్రాండ్ అని అంటుంటారు. ఇతరుల గురించి మీరు ఏదైనా మంచి చేశారా? అని పోతిన ప్రశ్నించారు. మీరు కాదు.. అల్లు అర్జున్ ఓ బ్రాండ్. తనకు గొడుగు పట్టిన వారిని దర్శకులు, నిర్మాతలను చేసిన ఘనత ఆయనది. ఓ చిరిగిపోయిన లుంగీ కట్టుకొని నటిస్తే.. పుష్ప 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అది బ్రాండ్ అంటే.. అని పోతిన అన్నారు.

Is Producer Dil Raju Complaint against Pawan Kalyan

పుష్ప సినిమాతో ఇండస్ట్రీని బతికించాడు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా బతికించారా? అల్లు అర్జున్ మాత్రం బన్నీ వాసు, మారుతీ, ఎస్‌కేఎన్ ఎదుగుదలకు ఆయన తోడ్పాటు అందించారు. మీరు ఎవరినైనా అలా చేశారా? మీరు ఇటీవల స్కిల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడారు. అసలు మీకు స్కిల్ లేదు.. ఇక డెవలప్‌మెంట్ ఎక్కడ చేస్తారు అని విమర్శించారు.

Is Producer Dil Raju Complaint against Pawan Kalyan

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పవన్ కల్యాణ్‌పై నిర్మాత దిల్ రాజు ఫిర్యాదు చేశాడు. మీ మధ్య వివాదానికి కారణం ఏమిటి? మీరే ఆదాయపు పన్ను కట్టి రెమ్యునరేషన్ ఇవ్వాలని ఇబ్బంది పెడితే.. ఆయన లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేసింది నిజం కాదా? అని వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఆడియో ఫంక్షన్‌లో మీరు అర్ధం చేసుకోండి.. మీరు చెప్పండి అంటూ బతిమాలిన విషయం నిజం కాదా? మీకే కాదు.. మాకు కూడా ఇంటెలిజెన్స్ విషయాలు చేరవేస్తాయి అని అన్నారు.

ఇక హరిహర వీరమల్లు సినిమా ఆధారం చేసుకొని పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు చేశారు. ఆ సినిమా నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా నిర్మాత ఎవరో తెలుసా? చంద్రబాబు నుంచి తీసుకొన్న ప్యాకేజ్‌ను వైట్ చేసుకోవడానికి ఈ సినిమా సాకుగా పెట్టుకొన్నావనే అనుమానాలు అందరిలోనే ఉన్నాయి. అందుకే ఆ సినిమా నిర్మాణం పూర్తి కావడం లేదు అని పోతిన మహేష్ ఆరోపించారు.

Is Producer Dil Raju Complaint against Pawan Kalyan

పార్టీ నడపడానికి నా సొంత డబ్బు ఖర్చు చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదం. చిరంజీవి, జనసైనికులు, ఎలక్ట్రోరల్ బాండ్స్ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయి? ఎన్ని ఆస్తులు కొన్నావో బయటపెట్టాలని పోతిన ఆరోపించారు. హరిహర వీరమల్లు సినిమాను బ్లాక్ మనీతో నడుపుతున్నారు అని ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X