పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ కాపీనా? కన్నడ సినిమా మూవీ క్లైమాక్స్ సేమ్ టూ సేమ్!
రీసెంట్ గా తెలుగు సినిమా నుంచి వచ్చిన పాన్ ఇండియా హిట్ చిత్రాల్లో ఇక స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప పార్ట్ 2 కూడా ఒకటి. అయితే ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ రెడ్డి తన మార్క్ విజన్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించే విధంగా తెరకెక్కించారు. ఇలా ఇండియా వైడ్ గా అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డు వసూళ్లు సాధించిన పుష్ప పార్ట్ 2 జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఓటిటిలో కూడా రిలీజ్ కి వచ్చింది.
అయితే వరల్డ్ పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో సినిమాను పాన్ ఇండియా భాషల్లో తీసుకురాగా ఈ సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ పై క్లైమాక్స్ లో సాగే రప్ప రప్ప యాక్షన్ ఎపిసోడ్ ఒరిజినల్ హైలైట్ అవుతుంది. కాగా ఈ ఎపిసోడ్ కి విదేశీ ఆడియెన్స్ సైతం ఓ రేంజ్ లో ఇంప్రెస్ అయ్యిపోయి ఇలాంటి సీన్ ని హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడలేదు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

అసలు నిజానికి ఇది సుకుమార్ క్రియేటివిటీ కాదు అంటూ సోషల్ మీడియాలో పలు కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతున్నాయి. పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్ లో అల్లు అర్జున్ చేతులు, కాళ్లు కట్టేసి కత్తి నోట్లో పెట్టుకుని ఫైట్ చేస్తూ ప్లాన్ చేసిన సీక్వెన్స్ బాగానే హిట్ అయింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు దీనిని సుకుమార్ పుష్ప 2 కంటే ముందే వచ్చిన ఓ కన్నడ సినిమా నుంచి కాపీ కొట్టినట్టుగా కన్నడ ఆడియోస్ చెబుతున్నారు.
కాగా ఆ సినిమా మలయాళం స్టార్ హీరో కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన యాక్షన్ కం పీరియాడిక్ చిత్రం "కాటేరా" సినిమాలోదట ఇంట్రెస్టింగా ఈ సినిమాతో కాటేరా సీన్ పెట్టి కన్నడ నెటిజన్స్ తమ సినిమా 2023 లోనే వచ్చిందని దాని నుంచి ఈ సీన్ ని కూడా కాపీ కొట్టారు అంటూ ఆ వీడియో పెట్టి మరి సుకుమార్ పై కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా పుష్ప 2 కంటే కాటేరా లో సీన్ మరింత రియలిస్టిక్ గా కూడా ఉంటుందని అంటున్నారు.
మరి ఈ సీన్ చూస్తే దగ్గరగా పుష్ప 2 లో ఉన్నట్టే కనిపిస్తుంది. దీంతో సుకుమార్ పై కూడా కాపీ మరకలు పడ్డట్టు అయ్యింది. కాగా కాటేరా సినిమా కన్నడ ఇండస్ట్రీ దగ్గర భారీ హిట్ అయింది, మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఏ ఓటిటిలో చూడొచ్చంటే.. కేవలం కన్నడ వెర్షన్ లోనే జీ5 వారు సొంతం చేసుకోగా అందులో దీనిని చూడవచ్చు.
మరి మన తెలుగు సినిమాలో చాలా మంది ఇతర దర్శకుల విషయంలో ఇలా కాపీ క్యాట్ కామెంట్స్ ఉండేవి కానీ సుకుమార్ పై మాత్రం లేవు. గతంలో ఎప్పుడూ కూడా సుకుమార్ చేసిన ఫలానా సినిమాలో సీన్ హాలీవుడ్ నుంచి తీసుకుంది అనే దాఖలాలు కూడా లేవు. మరి ఈ సీన్ మాత్రం నిజంగానే సుకుమార్ లేపేసారా లేక యాదృచ్చికంగానే జరిగిందా అనేది మాత్రం తనకే తెలియాలి.


Click it and Unblock the Notifications











