పీకల్లోతు కష్టాల్లో పుష్ప జగదీష్.. ఎంత దారుణం చేశావు కేశవా! పోలీసుల విచారణలో సంచలన విషయాలు
దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో గుర్తుండిపోయే నటనను ప్రదర్శించిన జగదీష్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు. తనతో అక్రమ సంబంధం ఉన్న యువతి ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలతో జగదీష్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఆయననను పోలీసులు ప్రశ్నించగా.. సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం..
గత కొద్ది నెలలుగా జూనియర్ ఆర్టిస్ట్‌తో జగదీష్‌కు అక్రమ సంబంధం ఉండేది. అయితే జగదీష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో వారి బంధానికి బ్రేక్ పడింది. అయితే కొన్ని నెలల తర్వాత ఆమె మరో యువకుడితో రిలేషన్ పెట్టుకొన్నది. అయితే ఈ విషయం తెలిసిన జగదీష్ తన మాజీ ప్రేయసిని బెదిరించడం మొదలుపెట్టాడు అని పోలీసుల విచారణలో తెలిసింది.

అయితే తన మాజీ ప్రియురాలిని వెంటాడుతూ వేధిస్తున్న క్రమంలో ఓ రోజు ఆమె తన తాజా ప్రియుడితో శృంగారం జరుపుతుండగా జగదీష్ దొంగచాటుగా బెదిరించడం మొదలు పెట్టాడు. తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. ఒక రోజు ఆమె వాట్సప్‌కు ఫోటోలు పంపించాడు. అలా బెదిరింపులు తట్టుకోలేక ఆ యువతి సూసైడ్ చేసుకొన్నది.
ఇక యువతి సూసైడ్ వెనుక అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను చెక్ చేశారు. ఆమె వాట్సప్ చాటింగ్, కుటుంబ సభ్యులను విచారించడంతో జగదీష్ వ్యవహారం బయటకు వచ్చింది. దాంతో జగదీష్‌ను డిసెంబర్ 6వ తేదీన పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయనను పోలీసులు పలు కోణాల్లో విచారించారు.

అయితే పోలీసుల విచారణలో జగదీష్ తన నేరాన్ని ఒప్పుకొన్నట్టు తెలిసింది. తన మాజీ ప్రేయసిని బ్లాక్ మెయిల్ చేసింది నిజమే. ఆమెను పలు రకాలుగా వేధించాను. ఆమె ప్రైవేట్ ఫోటోలు వాట్సప్‌లో షేర్ చేశాను. దాంతోనే ఆమె సూసైడ్ చేసుకొన్నది అని జగదీష్ నేరాన్ని ఒప్పుకొన్నట్టు తెలిసింది. ఈ విషయాలను పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, పుష్ప చిత్రంలో జగదీష్ నటించాల్సిన సన్నివేశాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని తెలిసింది. అల్లు అర్జున్, జగదీష్ కాంబినేషన్‌లో చాలా సీన్లు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. నిందితుడు బెయిల్‌పై వస్తే షూట్ చేయాలని వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











