Jailer లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేసిన రజనీ.. వారిని అలా కెలికిన తలైవా!

ఏపీలోని రాజకీయాలతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీతో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష యుద్ధం కొనసాగిస్తున్నారనే విషయం తన మాటలు, సినిమాల్లోని డైలాగ్స్‌తో సెటైర్లు వేయడం జరుగుతున్నది. గతంలో చంద్రబాబు నాయుడు విజన్ గురించి గొప్పగా మాట్లాడటం రుచించని వైసీపీ నేతలు ... రజనీకాంత్‌పై విరుచుకుపడటం తెలిసిందే.

అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ వేడుకలో తిట్టని నోరు, విమర్శించని ఊరు లేదు. ఆ రెండు లేని ఊరే లేదు. అయినా పట్టించుకోకుండా మన పని మనం చేసుకొంటూ పోవాలి అంటూ తన స్పీచ్‌ను తమిళంలో కొనసాగించి చివరకు అర్ధమైందా రాజా? అంటూ తెలుగు కామెంట్ చేయడం సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చోటు కల్పించింది. ఇలాంటి నేపథ్యంలో రిలీజైన జైలర్ సినిమాలో కూడా ఏపీలో కొన్ని వివాదాస్పద అంశాన్ని బేస్ చేసుకొని డైలాగ్స్ రాయడం చర్చనీయాంశమైంది. ఆ డైలాగ్ వివరాల్లోకి వెళితే..

Rajinikanth Jailer Movie

వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్.. కొద్ది నెలల క్రితం విజయవాడలో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాల్లో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రతిభ గురించి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ గురించి, ఆ తర్వాత చంద్రబాబు పాలన, విజన్ గురించి గొప్పగా మాట్లాడటం వైసీపీ శ్రేణులకు నచ్చకపోవడంతో వివాదంగా మారింది.

తాజాగా జైలర్ సినిమాలో ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి ఓ సీన్ ఆసక్తిని రేపింది. తీహార్ జైలులో జైలర్‌గా రజనీకాంత్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ రౌడీ ఎదురు తిరుగుతాడు. జైలులో నిబంధనలు పాటించకపోతే ఎలాంటి శిక్షనైనా విధిస్తానని జైలర్‌గా రజనీ హెచ్చరిస్తాడు. దాంతో ఆంధ్రాకు ఒక్క ఫోన్ కొడితే నీ ఫ్యామిలీ నాశనం అవుతారని హెచ్చరిస్తాడు.

Rajinikanth Jailer Movie

జైలులో రౌడీ హెచ్చరికలకు జరుగకపోగా, చేతిలో ఫోన్ పెట్టి.. ఏపీలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలకు ఫోన్ చేసుకో. ఏం చేస్తారో చేసుకో అంటూ జైలర్ సవాల్ విసురుతాడు. రౌడీ ఫోన్ చేసి ఏదో చేసే లోపే జైలర్ ఇచ్చిన షాక్ అదిరిపోయేలా ఉంటుంది.

Rajinikanth Jailer Movie

ఇక జైలర్ సినిమాల్లో దేవుడి కిరీటం దొంగిలించే సీన్ మంగళగిరిలోని ఓ ప్రముఖ దేవాలయం ఆధారంగా సాగుతుంది. అయితే ఏపీ కాకుండా తెలంగాణలోని ఏదైనా ప్రాంతం పెట్టుకోవచ్చు కదా. కావాలని ఏపీనే ఎందుకు ఎంచుకొన్నారు. ఇలా వైసీపీ, ఏపీ రాజకీయాలను పరోక్షంగా కెలికారా? అనే అభిప్రాయం, చర్చ సినీ వర్గాల్లో జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X