RC15 రాంచరణ్, శంకర్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. మెగా ఫ్యాన్స్‌కు పండుగే

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RC15 సినిమా టైటిల్‌పై ఉత్కంఠ నెలకొన్నది. ఇటీవల ఈ సినిమాకు ఫలానా టైటిల్ పెడుతున్నామనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే తాజాగా RC15 కోసం టైటిల్‌ను ఖరారు చేశారనే విషయంలోకి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ టైటిల్ వివరాల్లోకి వెళితే..

Ram Charans RC15

RC15 సినిమా కోసం పవర్‌పుల్ టైటిల్స్‌ను రిజిస్టర్ చేశారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమా కోసం సేనాని, సేనాపతి, సీఈవో, సైనికుడు అనే నాలుగు టైటిల్స్‌ను రిజిస్టర్ చేశారనే వార్త ట్రెండింగ్ అయింది. అయితే వీటిలో ఒకటి ఫైనల్ చేస్తారనే విషయం చర్చనీయాంశమైంది.

RC15 సినిమా కోసం రిజిస్టర్ చేసిన నాలుగు టైటిల్స్‌లో సేనాని అనే టైటిల్‌ను రాంచరణ్ టీమ్ ఫైనల్ చేసిందని, అయితే శంకర్‌కు సేనాని టైటిల్ నచ్చలేదనే వార్తలు వచ్చాయి. అయితే సైనికుడు అనే టైటిల్‌ను దర్శకుడు శంకర్ ఇష్టపడుతున్నారు. అయితే ఈ రెండు టైటిల్స్‌తో సీఈవో టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

అయితే RC15 సినిమాకు చివరిగా CEO టైటిల్‌ను ఖారారు చేసినట్టు సమాచారం. త్వరలోనే అంటే.. మార్చి 27 తేదీన అంటే రాంచరణ్ బర్త్ డే రోజున ఈ సినిమా టైటిల్‌ ప్రకటించనున్నారు. దీంతో పాటు గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేస్తారు. గ్లింప్స్ నిడివి 4 సెకన్లు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ టైటిల్‌ ప్రకటనపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వస్తుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X