గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్.. దిల్ రాజుతో రాంచరణ్ మూవీ.. గ్లోబల్ స్టార్ క్రేజీ లైనప్ ఇదే!
గ్లోబల్ స్టార్ రాంచరణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించకపోవడం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మెగా అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా తడబాటుకు గురైంది. అయితే ఈ సినిమా తర్వాత కొన్ని రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటి గురించి మెగా పవర్ స్టార్ టీమ్ కొట్టిపడేసింది. ఆ రూమర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గేమ్ ఛేంజర్ సినిమాను దర్శకుడు శంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సాంగ్స్‌ను తనదైన స్టయిల్‌లో తెరకెక్కించే డైరెక్టర్.. ఈ సినిమాకు అదే పద్దతిని కొనసాగించారు. కేవలం పాటల చిత్రీకరణకే సుమారుగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని దిల్ రాజు చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఈ రేంజ్ బడ్జెట్‌తో రూపొందించిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషంగా చెప్పుకోవాలి.

అయితే భారీ బడ్జెట్, టాలెంటెడ్ టీమ్ వర్క్ చేసినప్పటికీ.. ఈ సినిమా నేటితరం ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉండటం నిరాశను కలిగించింది. అయితే ఈ సినిమా తర్వాత తక్కువ రెమ్యునరేషన్‌తో మరోసారి దిల్ రాజుతో సినిమా చేస్తున్నారు. వెంటనే ఈ సినిమా ప్రారంభమవుతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తను చెర్రీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత దిల్ రాజుతో వెంటనే ఓ సినిమాను రాంచరణ్ చేయబోతున్నారనే వార్తలో వాస్తవం లేదు. సోషల్ మీడియాలో ఓ ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. ప్రస్తుతం మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రూపొందించే ప్లాన్స్ లేవు. దిల్ రాజు బ్యానర్‌లో వెంటనే సినిమా ప్రారంభించే ప్లాన్ లేదు అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న రూమర్లకు బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు.
అయితే రాంచరణ్ ప్రస్తుతం బిజీగా మారిపోయారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి 29 నుంచి హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ ప్రారంభవుతుంది అని చిత్ర యూనిట్ వివరాలను అందించింది.
బుచ్చిబాబుతో RC16 తర్వాత మెగా పవర్ స్టార్ లైనప్ రెడీగా ఉంది. ఆ సినిమా తర్వాత రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కాబోతున్నది. RC17 మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఆ తర్వాతే మరో సినిమా ఏదైనా ఉంటే.. దానిని పట్టాలెక్కిస్తారు. ఇప్పటికిప్పుడు దిల్ రాజుతో మూవీ లేదని.. భవిష్యత్‌లో అన్నీ కుదిరితే సినిమా ఉంటుందని వార్త మీడియాలో ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











