Balakrishna vs Ram Charan బాలయ్య డేట్ ని రూల్ చేస్తున్న రామ్ చరణ్.. ఎలాగంటే!

ఇన్నేళ్ల టాలీవుడ్ సినీ ప్రస్థానంలో కొన్ని ఫ్యామిలీలు టాలీవుడ్ ని ఏలుతూ వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ అని నందమూరి ఫ్యామిలీ అని, ఇంకా అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు నాలుగు మూల స్తంభాలుగా భావిస్తారు. అయితే ఎక్కువమంది హీరోలు వీరి కుటుంబాల నుంచే ఉన్నారు.

కానీ ఈ నాలుగు ఫ్యామిలీస్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ పరంగా కానీ అభిమానుల మధ్య రైవలి పరంగా కానీ చూస్తే రెండు ఫ్యామిలీల నడుమ పోటాపోటీ మామూలుగా ఉండదు. అది ఈపాటికే అర్ధం అయ్యిపోయి ఉండవచ్చు. వారి మెగా అండ్ నందమూరి ఫ్యామిలీ. అయితే ఒకప్పుడు వరకు ఇరు ఫ్యామిలీస్ నడుమ హీరోస్ మధ్యే సినిమాల రూపాన కౌంటర్ డైలాగ్స్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి మారింది అని చెప్పాలి.

Is ram charan s Game Changer face off with balakrishna movie release date

మెయిన్ గా మెగా యంగ్ హీరో గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి నందమూరి హీరో బాలకృష్ణ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చూస్తే ముచ్చటేస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్ లలో అయితేనేం.. కొన్ని సార్లు కలిసిన సందర్భాలు చూస్తేనేం నందమూరి, మెగా కుటుంబం మధ్య చాలా దూరం తగ్గిపోయింది. కాగా ఇప్పుడు ఇదే రామ్ చరణ్, బాలయ్య సినిమాల నడుమ క్లాష్ పడే పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం "గేమ్ ఛేంజర్" శంకర్ కలయికలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో పక్క బాలయ్య తన కెరీర్ 109వ సినిమాని దర్శకుడు బాబీతో చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది రామ్ చరణ్ సినిమా మీదనే ఆధారపడి ఉందట. ఈ రెండు సినిమాలు ఇప్పుడు డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

Is ram charan s Game Changer face off with balakrishna movie release date

చరణ్ సినిమాని అక్టోబర్ లో అనుకున్నారు కానీ అప్పటికి సాధ్యం కాదని తెలుస్తుంది దీనితో డిసెంబర్ క్రిస్మస్ రేస్ లో ఫిక్స్ చేసారని తెలుస్తుంది. కాగా ఇదే టైం కి బాలయ్య సినిమాని కూడా అనుకుంటున్నారట. కానీ ఇది గేమ్ ఛేంజర్ వచ్చే దాన్నిబట్టి డిసైడ్ అవుతుంది అని తెలుస్తుంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ కానీ వస్తే మాత్రం బాలయ్య సినిమా మరో డేట్ చూస్కోవాల్సిందేనట.

అయితే ప్రీపోన్ లేదా వచ్చే ఏడాదికే అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అంత క్లోజ్ గా ఉండే బాలయ్య, చరణ్ లు సినిమా రిలీజ్ విషయంలో మాత్రం పోటీ పడక తప్పడంలేదు. కాగా బాలయ్య సినిమాని సితార ఎంటెర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార సినిమాస్ బ్యానర్ లపై నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మిస్తుండగా, చరణ్ సినిమాని దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రెండు సినిమాలకి కూడా సంగీత దర్శకుడు థమన్ నే వర్క్ చేస్తుండడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X