ఇంట్రెస్టింగ్: తొలిసారి వెనక్కి తగ్గిన రాంగోపాల్ వర్మ.. ఆ సీన్లు లేకుండానే సినిమా.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అప్పటి వరకు ఒక పంథాలో వెళుతున్న తెలుగు సినిమాకు సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు. దీంతో టాలీవుడ్‌లో బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అంతేకాదు, బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టాడు. అక్కడ కూడా సక్సెస్‌ఫుల్ మూవీస్ తీసి సత్తా చాటుకున్నాడు. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా సుపరిచితుడు అయిపోయారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అందుకే తాజాగా ఆయన తీసిన సినిమా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వర్మ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా నిర్ణయం.? వివరాల్లోకి వెళితే..

ఏపీ పాలిటిక్స్‌పై వర్మ ఫోకస్

ఏపీ పాలిటిక్స్‌పై వర్మ ఫోకస్

ఒకప్పుడు మాఫియా, ఫ్యాక్షన్ సినిమాలపై దృష్టి సారించిన రాంగోపాల్ వర్మ కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య విడుదలైంది. తాజాగా అతడు మరోసారి అదే తరహా సినిమాను తెరకెక్కించాడు. అదే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.

 ఏం చెప్పాడో దానికి భిన్నంగా చేశాడు

ఏం చెప్పాడో దానికి భిన్నంగా చేశాడు

ఈ సినిమా ప్రారంభించేప్పుడు వివాదాస్పదం కాని సినిమా అని ప్రకటించాడు. రెండు కులాలను తీసుకుని చేస్తున్న సినిమా గురించి వర్మ ఇలాంటి ప్రకటన చేశాడేంటి అని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత సినిమా అప్‌డేట్స్ బయటకు వచ్చే కొద్దీ వివాదాస్పదం అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ వదిలిన సమయంలో పెద్ద రచ్చే జరిగింది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
వర్మకు తొలిసారి గట్టి షాక్ తగిలింది

వర్మకు తొలిసారి గట్టి షాక్ తగిలింది

ఇప్పటి వరకు వర్మ ఏం చేసినా పెద్ద సంచలనం అవుతూనే వచ్చింది. కానీ, ఆయనకు మాత్రం ఎప్పుడూ ఎదురుదెబ్బలు తగలలేదు. అయితే, ఫస్ట్ టైమ్ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా సమయంలో మాత్రం గట్టి షాక్ తగిలింది. ఈ సినిమాను ఆపాలని వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సినిమాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది.

 వాళ్లైతే అస్సలు పట్టించుకోలేదు

వాళ్లైతే అస్సలు పట్టించుకోలేదు

సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డు సభ్యులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే బోర్డు సభ్యులు సినిమా చూశారు. కానీ, అదే ప్రింటుకు సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. లేకుంటే సినిమాలోని దాదాపు 90 వివాదాస్పదంగా ఉన్న సీన్లు తీయడానికి ఒప్పుకుంటే సర్టిఫికెట్ జారీ చేస్తామని అన్నారు.

డైరెక్టుగా రిలీజ్ చేస్తాడని అన్నారు

ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుంటే థియేటర్లలో విడుదల చేయడం కుదరదు. కాబట్టి.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను డైరెక్టుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి రాంగోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నాడని, త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. దీంతో అందరూ ఈ సినిమా కట్స్ లేకుండా వస్తుందని అనుకున్నారు.

వెనక్కి తగ్గిన సెన్సేషనల్ డైరెక్టర్

తాజాగా ఈ సినిమా విషయంలో రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన సినిమా పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని మార్చడంతో పాటు, కొన్ని సీన్లు కట్ చేసేందుకు సెన్సార్ బోర్డు సభ్యులతో చర్చలు జరిపాడని తెలిసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలవుతుందని సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X