మళ్లీ ప్రేమలో పడ్డ రానా దగ్గుబాటి.. ప్రేయసి ఎవరంటే..
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి మరోసారి ప్రేమలో పడ్డారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చినా రానా పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా అఫీషియల్‌గా రానా తన ప్రేమను బయపెట్టారు. అంతేకాకుండా ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో రానా అఫైర్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ ప్రచారమైంది. అభిమానులను, సినీ ప్రేక్షకులకు విపరీతంగా ఆసక్తిని రేపింది. వివరాల్లోకి వెళితే..

త్రిషతో అఫైర్
రానా వ్యక్తిగత విషయానికి వస్తే.. తన బాల్య స్నేహితురాలు త్రిషతో ఎప్పటి నుంచో అఫైర్‌ను కొనసాగిస్తున్నారు. వారిద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని విషయం సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వారిద్దరి మధ్య అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు మీడియాలోనూ, సోషల్ మీడియాలోను ఫోటోలు ప్రచారం అయ్యాయి. ఇప్పటికి వారిద్దరి మధ్య స్నేహానికి మించిన రిలేషన్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

రకుల్‌తో డేటింగ్ అంటూ
ఇది ఇలా ఉండగానే, ఇటీవల రానాతో రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. అయితే రకుల్ ప్రీత్ వెంటనే స్పందించి ఆ వార్తలను ఖండించారు. రానా, తాను పక్క పక్క ఇంట్లోనే ఉంటాం. మా మధ్య అలాంటి సంబంధం లేదు. రానాతో నాకు మొదటి నుంచి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. మా మధ్య అఫైర్ ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని రకుల్ క్లారిటీ ఇచ్చారు. ఇలా రానాతో కొన్ని అఫైర్లు వచ్చినా.. అవి రూమర్ల వరకే పరిమితం అయ్యాయి.

నేను ప్రేమలో పడ్డా.. స్వయంగా రానా
తాజాగా స్వయంగా రానా దగ్గుబాటి ప్రేమలో పడినట్టు చేసిన ట్వీట్ సెన్సేషనల్‌గా మారింది. మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్‌గా రానాకు మంచి పేరు ఉంది. రానా ప్రపొజల్‌కు మిహికా బజాజ్ అనే అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. ఆమె ఎస్ అన్నది అంటూ ట్వీట్ చేశారు. అయితే మిహికా వెడ్డింగ్ ప్లానర్‌గా పనిచేస్తున్నారు. ఆమెతో కొద్దిరోజులు చనువుగా ఉంటున్నారనే వార్తలు వచ్చినా.. అవి రూమర్లుగానే పరిగణించారు. అయితే తాజాగా ఆమె ఒప్పుకొన్నది అంటూ రానా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రానా కెరీర్ ఇలా..
బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకొన్న రానా కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుంచి కోలుకొన్నారు. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం చిత్రంలో సాయిపల్లవితో జతకట్టి నటిస్తున్నారు. అలాగే కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన ఒకటి రెండు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











