నెట్‌ఫ్లిక్స్‌లో రానా మూవీ.. హాథీ మేరి సాథీ రిలీజ్‌కు ప్రయత్నాలు

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా సినిమాల రిలీజ్‌పై అనిశ్చితి కొనసాగుతుండటంతో పలు సినిమాల నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైకి దృష్టిపెడుతున్నారు. నిర్మాణ వ్యయాలను భరించలేక, సినిమా భవిష్యత్‌తో బెంగపెట్టుకొన్న నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైకి మళ్లీస్తున్నారు. చాలా సినిమాలు ఇప్పుడు జూన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెటిఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో రానా దగ్గుబాటి నటించిన హాథీ మేరి సాథీ చిత్రాన్ని తమ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నిస్తున్నది.

హాథీ మేరి సాథీ చిత్రం విషయానికి వస్తే.. తెలుగులో అరణ్యగా, తమిళం, హిందీ భాషల్లో రూపొందింది. పర్యావరణవేత్త జాదవ్ పేయెంగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రభు సల్మాన్ దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమా థియేటర్లో ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.

Is Rana Daggubatis Haathi Mera Saathi to release on Netflix?

సినీ వర్గాల సమాచారం ప్రకారం... ఇటీవల నిర్మాత సురేష్ బాబును నెటి ఫ్లిక్స్ నిర్వాహకులు కొందరు కలిశారని, రానా నటించిన హాథీ మేరి సాథీ సినిమాను తమ ఛానెల్‌లో రిలీజ్ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అంశం తన పరిధిలో లేదని, తాను దర్శకుడు ప్రభు సల్మాన్‌తో చర్చించి వివరాలు తెలియజేస్తానని చెప్పినట్టు తెలిసింది.

హాథీ మేరి సాథీ సినిమాపై పెట్టిన నిర్మాణ వ్యయాన్ని రికవరీ చేసుకోవడానికి నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తారా లేక థియేటర్లలోనే రిలీజ్ చేసి సంప్రదాయ పద్దతులకు మద్దతుగా నిలుస్తారా అనే త్వరలోనే తెలుస్తుంది. అయితే ఒకవేళ థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రేక్షకులు చూడటానికి సినిమా హాళ్లకు వస్తారా అనేది అతి పెద్ద ప్రశ్నగా మారడంతో ఈ సినిమానే కాకుండా పలు సినిమాల రిలీజ్‌పై అనిశ్చితి కొనసాగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X