రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రష్మిక - విజయ్? ఈసారి వేరే లెవల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. ఆమె నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారడం ఆసక్తికరంగా మారింది. చివరిగా 'యానిమల్', 'పుష్ఫ2 : ది రూల్', 'ఛావా' చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ఇక మార్చి 30న రష్మిక మందన్న నటించిన 'సికందర్' చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం విజయవంతంగా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది.

సల్మాన్ ఖాన్ సరసన 'సికందర్'లో నటించగా ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. కేవలం వారం రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను అందుకుంది. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించడం విశేషం. ఇలా వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్న ఈ స్టార్ బ్యూటీ సెన్సేషన్ గా మారింది. ఇక ఈ రష్మిక మందన్న బర్త్ డే వేడుకలు ఏప్రిల్ 5న గ్రాండ్ గా జరిగాయి.

Is Rashmika Mandanna Celebrated her Birthday with Vijay Deverakonda

రష్మిక మందన్న తన 29వ పుట్టిన రోజు వేడుకలను ఓమాన్ దేశంలో గ్రాండ్ గా జరుపుకుంది. సెపరేట్ ఐలాండ్ లో ప్రత్యేకమైన ఏర్పాట్ల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగినట్టు స్టార్ బ్యూటీ పంచుకున్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. అయితే రష్మిక మందన్న పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మళ్లీ డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. గతంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పుకార్లు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ ఓకే హోటల్స్ లో కలుస్తూ కనిపించడం ఆ పుకార్లను మరింతగా బలపరుస్తున్నాయి.

ఇక రష్మిక మందన్న పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వీరిద్దరూ ఓకే చోట ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాము పంచుకున్న ఫొటోలు ఒకే లోకేషన్ కు సంబంధించినవి అయి ఉండటంతో రష్మిక మందన్న పుట్టిన రోజు వేడుకలను విజయ్ దేవరకొండతోనే కలిసి చేసుకుందని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమ ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. మరోవైపు రష్మిక మందన్నకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లైక్స్, కామెంట్లతో నెటిజన్లు మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇలా గతంలో చాలా ఆధారాలను చూపిస్తూ విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారని పుకార్లు వ్యాప్తి చేశారు. కానీ వారు మాత్రం కేవలం స్నేహితులమనే చెబుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న నెక్ట్స్ ధనుష్ 'కుబేరా' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత 'ది గర్ల్ ఫ్రెండ్', 'థామా' అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని 'కింగ్ డమ్' చిత్రంతో అలరించబోతున్నారు. ఇక రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో కలిసి నటించారు. ఇక మరోసారి వీరి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా? అని ఫ్యాన్స్ మాత్రం ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X