రియా చక్రవర్తితో టాలీవుడ్ నిర్మాతకు చేదు అనుభవం.. సుశాంత్ మృతికి ముందే షాకింగ్ నిర్ణయం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా బయటపడిన డ్రగ్స్ మాఫియా లింకుల కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అరెస్ట్‌కు ముందు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న తెలుగు చిత్రం సూపర్ మచ్చి చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. కొన్ని రోజుల షూటింగు తర్వాత నిర్మాతను ఇబ్బందికి గురిచేయడంతో ఆమెను సినిమా నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే రియాను తప్పించడం వెనుక బయటకు వచ్చిన ఆసక్తికరమైన వార్తలు ఏమిటంటే..

డేట్స్ గురించి వాగ్వాదం
సూపర్ మచ్చి చిత్రంలో కల్యాణ్ దేవ్ పక్కన నటింప చేయడానికి రియా చక్రవర్తిని రెండో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం 70 రోజులు డేట్స్ కేటాయించారు. ఆ తర్వాత ఆమెతో డేట్స్ సమస్య ఏర్పడటంతో వివాదం ఏర్పడింది. తాను హిందీ సినిమాను కమిట్ అయ్యాను. మీకు కేటాయించిన డేట్స్ అయిపోయాయి. కాబట్టి ఇక రాలేను అంటూ మొండి కేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మీ కంపెనీపై నమ్మకం లేదంటూ
అంతేకాకుండా రియా చక్రవర్తి నిర్మాతతో తీవ్రమైన వాగ్వాదానికి దిగిందట. మీ ప్రొడక్షన్ కంపెనీపై నాకు నమ్మకం లేదు. సినిమా పూర్తవుతుందో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేసిందట. అయినా కొన్ని రోజులు షూటింగు జరిగినందున మిగితా సన్నివేశాలను పూర్తి చేయాలని నిర్మాతలు కోరితే అందుకు విముఖత వ్యక్తం చేశారని చెప్పారు.

సినీ పెద్దలు రంగంలోకి దిగినా..
రియా చక్రవర్తిని ఒప్పించడానికి సినీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆమెతో మాట్లాడి షూటింగుకు వచ్చేలా ఒప్పించారు. అయితే రెండు నెలల తర్వాత తాను వస్తానని చెప్పినప్పటికీ.. నెల రోజుల తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమెను సినిమా నుంచి తప్పించినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.
Recommended Video

రియా స్థానంలో మరో కన్నడ భామ
రియా చక్రవర్తి ప్రవర్తన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమె స్థానంలో మరో కన్నడ హీరోయిన్ సంధ్యా రామన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. రియాకు తప్పించిన విషయాన్ని చెప్పి కాంట్రాక్టును క్లోజ్ చేసినట్టు తెలిపారు. ఈ చిత్రంలో ఇప్పటికే రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











