Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
సాయిపల్లవి ఫ్యాన్స్ శుభవార్త.. లవ్ స్టోరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మరోసారి టాలీవుడ్‌పై భారీ ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర హీరోల సినిమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మాతలు వాయిదా వేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది.
ఒకవేళ వచ్చేనెల అంటే మేలో కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి వస్తే సినిమా రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉంది. అన్ని సానుకూలంగా ఉంటే లవ్ స్టోరి సినిమాను మే 13వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అది కూడా సీటింగ్ కెపాసిటీపై ఎలాంటి అంక్షలు పెట్టకుండా ఉంటే లవ్ స్టోరీని రిలీజ్ చేయాలని నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తున్నది.
లవ్ స్టోరి మూవీకి సంబంధించిన పాటలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయి. ఈ సినిమా పాటలకు మంచి రెస్సాన్స్ లభించింది. సాయిపల్లవి నటించిన పాటలు రికార్డుస్థాయి వ్యూస్ సాధించాయి. దీంతో ఈ సినిమా సక్సెస్‌పై రిలీజ్‌కు సానుకూలమైన అభిప్రాయం ఏర్పడింది. అయితే అనూహ్యంగా నిర్మాత, దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య ప్రెస్ మీట్ పెట్టి సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
దాంతో ఈ సినిమాను థియేటర్లో ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అక్కినేని, సాయిపల్లవి అభిమానులకు షాక్ తగిలింది. తాజాగా మే 13వ తేదీన రిలీజ్ చేస్తున్నారనే వార్త నిజంగా అభిమానులకు సంతోషం కలిగించడం ఖాయంగా కనిపిస్తున్నది.