twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయిపల్లవి ఫ్యాన్స్ శుభవార్త.. లవ్ స్టోరి కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే!

    |

    తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మరోసారి టాలీవుడ్‌పై భారీ ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర హీరోల సినిమాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మాతలు వాయిదా వేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది.

    ఒకవేళ వచ్చేనెల అంటే మేలో కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి వస్తే సినిమా రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉంది. అన్ని సానుకూలంగా ఉంటే లవ్ స్టోరి సినిమాను మే 13వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అది కూడా సీటింగ్ కెపాసిటీపై ఎలాంటి అంక్షలు పెట్టకుండా ఉంటే లవ్ స్టోరీని రిలీజ్ చేయాలని నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తున్నది.

     Is Sai Pallavis Love Story to release on May 13?

    లవ్ స్టోరి మూవీకి సంబంధించిన పాటలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయి. ఈ సినిమా పాటలకు మంచి రెస్సాన్స్ లభించింది. సాయిపల్లవి నటించిన పాటలు రికార్డుస్థాయి వ్యూస్ సాధించాయి. దీంతో ఈ సినిమా సక్సెస్‌పై రిలీజ్‌కు సానుకూలమైన అభిప్రాయం ఏర్పడింది. అయితే అనూహ్యంగా నిర్మాత, దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య ప్రెస్ మీట్ పెట్టి సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

    దాంతో ఈ సినిమాను థియేటర్‌లో ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అక్కినేని, సాయిపల్లవి అభిమానులకు షాక్ తగిలింది. తాజాగా మే 13వ తేదీన రిలీజ్ చేస్తున్నారనే వార్త నిజంగా అభిమానులకు సంతోషం కలిగించడం ఖాయంగా కనిపిస్తున్నది.

    English summary
    Sai Pallavi, Naga Chaitanya's Love story set to release on 16th April. But due to covid 19 situation in the Telugu states. This movie release postponed temporarily. Movie unit planning to release this movie May 13th if things are fair in Telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X