అట్లీ, అల్లు అర్జున్ మూవీ స్క్రిప్టును రిజెక్ట్ చేసిన సూపర్ స్టార్.. ఆ హీరో ఎవరో తెలుసా?

ఇపుడు పాన్ ఇండియా అంతా మాట్లాడుకుంటున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది తమిళ టాలెంటెడ్ యువ దర్శకుడు అట్లీ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కలయికలో తెరకెక్కించనున్న సినిమానే అని చెప్పవచ్చు. ఎప్పుడు నుంచో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఎట్టకేలకి అనౌన్స్ అయ్యింది. హిందీ మార్కెట్ లో అట్లీ అలాగే అల్లు అర్జున్ ఇద్దరూ జవాన్, పుష్ప 2 సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు.

ఇలా హిందీ ఆడియెన్స్ కి మరింత దగ్గరైన ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇక దానిపై అంచనాలు ఏ లెవెల్లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. కాగా హాలీవుడ్ రేంజ్ లో అనౌన్స్ అయ్యిన ఈ సినిమాపై ఇపుడు మరిన్ని క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అట్లీ ఈ సినిమాని ఎప్పుడు నుంచో దాచుకున్న సబ్జెక్టు అట. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ లో సినిమా చేయాలని తన డ్రీం ప్రాజెక్ట్ గా ఎపుడు నుంచో అనుకుంటున్న సినిమా ఇది అని తెలుస్తుంది.

Atlee Movie Rejected by Salman Khan

అయితే అసలు ఈ సినిమాకి మొదటి ఛాయిస్ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాదని బిగ్ ట్విస్ట్ వినిపిస్తుంది. కాగా దీనిపై ఇంకొంచెం వెనక్కి వెళితే కొన్నాళ్ల కితం అట్లీ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ తో పాటుగా మరో భారీ కాంబినేషన్ అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి. అట్లీ, సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంకా హాలీవుడ్ హీరో విల్ స్మిత్ తో సినిమా అంటూ రూమర్స్ వచ్చాయి.

ఇక్కడే అన్ని డాట్స్ కలుస్తున్నాయి. కాగా వారిలో సల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేసుకున్న సినిమానే ఇపుడు అల్లు అర్జున్ తో అట్లీ ఓకే చేసుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ప్రస్తావన వచ్చినపుడే ఇండియన్ సినిమాకి హాలీవుడ్ సినిమాకి కనెక్షన్ గా ఓ సినిమాని అట్లీ చేస్తున్నాడు అని అర్ధం అయ్యింది. ఇక ఇపుడు అల్లు అర్జున్ సినిమా అనౌన్సమెంట్ ఆ పోస్టర్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్ లోనే తలపిస్తున్నాయి.

సో వారి తర్వాతే అల్లు అర్జున్ దగ్గరకి ఈ సినిమా వచ్చినట్టుగా టాక్. కాగా మొదట్లో అయితే సల్మాన్ తో చేయాలని అట్లీ ట్రై చేసినప్పటికీ తాను రిజెక్ట్ చేశారట. దీనితో ఇలా బన్నీ ఈ బిగ్ ప్రాజెక్ట్ కొట్టేశాడని టాక్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ సినిమా ఆ సినిమా కూడా ఒకటేనా లేక అట్లీ రెండూ వేరేవేరుగా ప్లాన్ చేసుకున్నాడా అనేది తన నుంచే ఓ క్లారిటీ వస్తే అందరికీ అర్ధం అవుతుంది. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ ని తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, రోబో, జైలర్, సర్కార్ ఇంకా ఎన్నెన్నో క్రేజీ ప్రాజెక్ట్ లు అందించిన వారి నుంచి రాబోతుండగా ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారట.

More from Filmibeat

Read more about: atlee allu arjun aa22
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X