కీర్తి సురేష్, సామ్ లని చీట్ చేసిన ఖిలాడీ.. 100 కోట్లకి టోకరా.. మొత్తానికి పోలీసులకి చిక్కాడట..
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోయిన్లు ఎవరంటే స్టార్ బ్యూటీ సమంత , నాచురల్ బ్యూటీ కీర్తి సురేష్ ల పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి. కెరీర్ స్టార్ట్ చేసిన కొంత కాలానికే వీరిద్దరూ మంచి ఫేమ్ తెచ్చుకొని సౌత్ సినిమాలో సక్సెస్ అయ్యారు. ఇక సౌత్ సినిమా దగ్గర మంచి స్టార్డం చూసిన తర్వాత హిందీలోనూ అడుగుపెట్టారు.
కాగా హిందీ ఇండస్ట్రీలో ఆల్రెడీ సమంత పలు వెబ్ సిరీస్ లతో రాణించగా ఇపుడు కీర్తి సురేష్ డైరెక్ట్ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇలా సౌత్ నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అనే కామన్ పాయింట్ కాకుండా వీరిద్దరి విషయంలో కలవడం అనేది ఇపుడు చర్చకు దారి తీసింది.

జనరల్ గా ఇలాంటి స్టార్ హీరోయిన్స్ లేదా అప్పుడప్పుడే మంచి ఫేమ్ తెచ్చుకుంటున్న హీరోయిన్స్ అంటే యాడ్స్, మాల్స్ ఓపెనింగ్స్ ఇంకా ఇతర బ్రాండ్ కి అంబాసిడర్లుగా కనిపిస్తారని తెలిసిందే. ఇలా సామ్, కీర్తి సురేష్ సహా చాలా మంది సెలబ్రెటీలకు ఓ కేటుగాడు టోకరా పెట్టాడట.
తృతీయ జ్యూయెలరీ యజమాని కాంతి దత్ అనే అతను పలువురు హీరోయిన్స్ , పొలిటికల్ రిలేటెడ్, వ్యాపార కుటుంబాలకు చెందిన మహిళని భారీ మొత్తంలో మోసం చేసిన ఉదంతం ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఈ కార్ట్, ఫ్లిప్ కార్ట్ లాంటి మాదిరిగానే ఇతగాడు సస్టెయిన్ కార్ట్ అనే ఒకదాన్ని సెట్ చేసి అందులో సినీ తారలు, ఇతర రంగాల్లో ప్రముఖుల చేత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి చీట్ చేసాడట.

ఇలా మొత్తంగా అందరికీ కలిపి రూ. 100 కోట్లకి పైగానే టోపీ పెట్టాడని తెలుస్తుంది. ఇతని లిస్ట్ లో స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంతలు కూడా ఉన్నారని ఓ టాక్ వినిపిస్తోంది. ఓ వ్యాపారవేత్త అయినటువంటి లేడీ పర్సన్ ఇతని వల్ల మోసపోయానని హైదరాబాద్ పోలీస్‌లను ఆశ్రయించగా అసలు విషయం బయటకి వచ్చింది.
ఇతడిని హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకి వచ్చింది. నిందితుడిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయట. మరి ఇతని బాధితుల్లో సామ్, కీర్తి సురేష్ లు కూడా ఉన్నారో లేదో అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఇక రీసెంట్ గానే సమంత నటించిన భారీ సిరీస్ సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకి రాగా దీని తర్వాత మళ్ళీ హిందీ లోనే మరో సిరీస్ తో ఆమె రెడీ అవుతుంది. ఇక కీర్తి సురేష్ అయితే బేబీ జాన్ అనే సినిమాతో అదే సమంత చేసిన సిటాడెల్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ క్రిస్మస్ కానుకగా రిలీజ్‌కి తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











