ఆ విషయంలో సమంత, నాగచైతన్య కలిసే.. విడాకుల తర్వాత కూడా అలా!

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చ జరుగుతున్న వ్యవహారం సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం. వారిద్దరూ విడాకులు తీసుకొని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఆ ఇద్దరి గురించి మీడియాలో ఏదో ఒక విషయంపై కథనాలు వస్తూనే ఉంటాయి. అయితే వారిద్దరి రిలేషన్ గురించిన ఓ ఆసక్తికరమైన విషయం మీడియలో షికారు చేస్తున్నది. విడాకుల తర్వాత శోభితాను రెండో పెళ్లి చేసుకొన్న నాగచైతన్య ఓ విషయంలో ఇంకా సమంతతో రిలేషన్ కొనసాగిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఆ విషయంలోకి వెళితే..

నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని.. కొన్నేళ్లు సక్సెస్‌ఫుల్‌గా కెరీర్, లైఫ్ లీడ్ చేశారు. వారిద్దరూ కలిసి దాంపత్య జీవితం కొనసాగించిన సమయంలో రెండు పెంపుడు కుక్కలను పెంచుకొన్నారు. ఆ రెండు పెట్ డాగ్స్‌ను కన్నబిడ్డల్లా చూసుకొన్నారు. అయితే వాటిని ఎంతగా ప్రేమించారంటే.. వాటికి ఇంటి పేరు కూడా అక్కినేని అని పెట్టుకొనేంతగా..

Samantha Ruth Prabhu still in relationship with Naga Chaitanya

చైతూ, సామ్ కలిసి ఉన్న సమయంలో రెండు ఫ్రెంచ్ బుల్ డాగ్స్‌ను పెంచుకొన్నారు. ఒకదాని పేరు హ్యాష్ అక్కినేని, రెండో దాని పేరు డ్రాగో అలియాస్ సాషా అక్కినేని. వాటి ఫోటోలను కూడా సమంత గతంలో షేర్ చేశారు. అయితే వారిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసినంత కాలం వాటికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అనుకోకుండా వారి దాంపత్య జీవితంలో కలతలు చోటు చేసుకోవడం.. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయింది.

అయితే విడిపోయే సమయంలో తాము ఇష్టంగా పెంచుకొన్న కుక్కు పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరిదనే విషయం వచ్చిందట. దాంతో ఆ రెండు కుక్క పిల్లలను ఇద్దరం కలిసి బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకొన్నారట. దాంతో హ్యాష్, సాషా కుక్క పిల్లలను చైతూ, సామ్ కలిసి సంరక్షణ చేస్తున్నారట. విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటన్నప్పటికీ.. పెట్ డాగ్స్ మాత్రం ఈ విషయంలో వారిని కలిపి ఉంచేలా చేశాయని వారి సన్నిహితులు చెప్పుకొంటున్నారు. హ్యాష్, సాషాకు అయ్యే ఖర్చును వారే భరిస్తున్నారనే విషయం తెలిసింది.

ఇదిలా ఉండగా, చైతూ విషయానికి వస్తే.. విడాకుల తర్వాత నాగచైతన్య మరోసారి శోభితాతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత రెండు కుటుంబాల అంగీకారంతో వారిద్దరూ కలిసి ఇటీవల పెళ్లి చేసుకోవడం కూడా తెలిసిందే. వారిద్దరూ హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అంతేకాకుండా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కూడా లీడ్ చేస్తున్నారు.

ఇక సమంత విషయానికి వస్తే.. విడాకుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఈ మధ్యనే కోలుకొన్నారు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ విషయంలో బిజీగా ఉన్నారు. ఇక ఆమె లవ్ లైఫ్ గురించి ఓ వార్త భారీగా చక్కర్లు కొడుతున్నది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారని.. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X