Samantha Ruthu Prabhu కు ఆరోగ్య సమస్య తిరగదోడిందా? సమంత హెల్త్ ఎలా ఉంది?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు గత కొద్దికాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల వల్ల ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని ఇటీవల నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఆమె ఆరోగ్యం పూర్తిగా నయమైందని భావిస్తున్న అభిమానులకు విజయ్ దేవరకొండ భారీ షాకింగ్ న్యూస్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
ఖుషి మూవీ హిట్ అయితే సమంత ముఖంలో నవ్వు చూడాలని ఉంది. నాకు ఆనందం కలిగించే విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కోసం సమంత ఎంత కష్టపడిందో మీకు తెలియదు. ఒక్క 2022 ఏప్రిల్‌లో నవ్వుతూ సినిమాను ప్రారంభించాం. 35 షూట్ మిగిలి ఉన్నప్పుడు నా హెల్త్ బాగోలేదని చెప్పింది. అయితే రెండు, మూడు రోజుల్లో తిరిగి షూటింగ్ పాల్గొంటామని అనుకొన్నాం. కానీ హెల్త్ పూర్తిగా దెబ్బ తిన్నదని చెప్పింది. దాంతో చూడటానికి నీవు బ్యూటీఫుల్‌గా ఉన్నావు. సినిమాలో నీవు ఎంత అందంగా ఉన్నావో స్క్రీన్ మీద అని అనుకొన్నాం. అలాంటి నీకు హెల్త్ ప్రాబ్ల్సెం ఉన్నాయా? అని ఆశ్చర్యపోయాం అని విజయ్ దేవరకొండ అన్నారు.
సమంత తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు.. ఏం కాదు.. షూటింగ్ చేయి చేయి అన్నాం. కానీ ఆమె పరిస్థితి చూసిన తర్వాత హెల్త్ బాగాలేదనిపించింది. 3 రోజుల్లో ఆరోగ్యం పుంజుకొంటుందని అనుకొన్నాం. కానీ అలా జరగలేదు. జూలైలో షూటింగ్ మానేశాం. వేరే సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిపోయాను. అప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి బాగలేదనే విషయం తెలిసింది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

సమంత గురించి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తర్వాత ఆమె బాధలను బయటకు చెప్పవద్దని అనుకొన్నాం. కానీ ఓ పాయింట్‌లో ఎంతో మంది తను బాధపడుతున్న సమస్యను బయటకు చెప్పకపోతే బాగుండదు. చాలా మందికి ఈ సమస్య గురించి చెప్పాలని బాధ్యతగా బయటకు వచ్చి చెప్పింది అని విజయ్ దేవరకొండ అన్నారు.

సమంత ఆరోగ్యం దెబ్బ తిన్న తర్వాత మమల్ని కలవడం మానేసింది. మాతో మాట్లాడటం మానేసింది. ఆ సమయంలో తన బాధలను షేర్ చేసుకొనింది. ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత మేము కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాం. ఈ సమస్యపై పోరాడే విషయంలో మీరే మాకు స్పూర్తి అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉందనిపించింది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

సమంత ఆరోగ్యం పూర్తిగా ఇంకా కుదురుకోలేదు. ఆమె లైటింగ్‌ను ఎక్కువగా చూడలేదు. కళ్లో లైట్ల వెలుగు పడితే తల నొప్పి వస్తుంది. కానీ తన ఆరోగ్య సమస్యను పక్కన పెడితే.. ఆమె మీ కోసం ఇక్కడికి వచ్చింది. అందంగా ముస్తాబైంది. మీ కోసం డ్యాన్స్ చేసింది. అందంతా మీ ప్రేమను పొందడానికే. ఈ విషయం నేను బాధ్యతగా చెప్పాలనుకొన్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.


Click it and Unblock the Notifications











