Game Changer: బోల్డ్ హీరోయిన్ రోల్‌ను సీక్రెట్‌గా.. శంకర్ గేమ్ ఛేంజ్ చేసేది ఆమెనా?

ఈ ఏడాదిలో పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి రావాల్సిన పలు చిత్రాల్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "గేమ్ ఛేంజర్" సినిమా కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన ఈ సినిమాని సెన్సేషనల్ దర్శకుడు శంకర్ అయితే తెరకెక్కిస్తున్నారు. మరి ఎప్పుడో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేసిన శంకర్ ప్రస్తుతం తన ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే.

తన రేంజ్ సినిమా పడాలని చాలా మంది చూస్తున్నారు. సరే ఇదిలా ఉండగా ఇపుడు గేమ్ ఛేంజర్ విషయానికే వస్తే.. ఇన్నేళ్ల కెరీర్ లో శంకర్ తన కథ కాకుండా మరో దర్శకుని కథతో సినిమా చేస్తున్నారు. పక్కా కమర్షియల్ పొలిటికల్ సినిమాగా ఇది వస్తున్నట్టు తాజా సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

is shankar gave very important role for anjali in game changer

అయితే శంకర్ సినిమాలు అంటే భారీతనం మైండ్ బ్లాక్ చేసే విజువల్స్, ముఖ్యంగా సాంగ్స్, అలాగే ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఇలా చాలా ఎలిమెంట్స్ తన సినిమాల్లో హైలైట్స్ గా కనిపిస్తాయి. మరి ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ తరహా ఎలిమెంట్స్ తోనే వస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఐతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ చరణ్ సరసన నటిస్తుండగా వారిలో ఒక హీరోయిన్ ని మాత్రం శంకర్ సినిమాలో చాలా కీలకంగా ప్రెజెంట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా టీజర్ తర్వాత అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో కూడా ఆమెపై చాలా విజువల్స్ ని శంకర్ చూపించి హైలైట్ చేశారు.

కానీ ఈమె కాకుండా ఇటీవల పలు బోల్డ్ పాత్రల్లో షైన్ అయ్యిన టాలెంటెడ్ హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో నటించింది. తన రోల్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఉంటే ఈమె పాత్రని మాత్రం శంకర్ టీజర్ లో అసలు చూపించినట్టే కనిపించలేదు. కానీ సరిగ్గా చూస్తే ఒకటీ రెండు ఫ్రేమ్స్ లో మాత్రమే అంజలి కనిపిస్తుంది. ఐతే వాటిలో ఒక ఫ్రేమ్ లో చూస్తే షాకవ్వాల్సిందే అని చెప్పొచ్చు.

is shankar gave very important role for anjali in game changer

ఒక ఛాలెంజింగ్ గెటప్ లో అంజలి కనిపించడం, టీజర్ లోనే అంత సీక్రెట్ గా మైంటైన్ చేయడం వంటివి సినిమాలో ఈమె రోల్ కి ఊహించని విధంగా మరింత ప్రాముఖ్యత ఉండబోతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. దీనితో గేమ్ ఛేంజర్ లో మాత్రం అంజలికి క్రేజీ రోల్ పడేలానే ఉందని చెప్పి తీరాలి. సినిమాలో ఆమెపైనే మొత్తం ఏమన్నా మారుతుందో అనేది కూడా చూడాలి.

శంకర్ సినిమాల్లో కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. మరి అలాంటివి కానీ ఈ సినిమాలో కూడా పడితే మాత్రం గేమ్ ఛేంజర్ ని ఆపడం అసాధ్యమే అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా గేమ్ ఛేంజ్ చేసే పాత్రనే అంజలి చేస్తుందా లేదా అనేది మాత్రం ఈ రానున్న జనవరి 10 వరకు ఆగి చూస్తే తేలిపోతుంది.

More from Filmibeat

Read more about: shankar ram charan kiara advani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X