ఇండియన్ 2 డిజాస్టర్ కు కారణం ఆ హీరోనేనా?

By Lekhaka

విజనరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు శంకర్ ఇటీవల కాలంలో తన పేరును నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నాడు. తాజాగా ఈ దర్శకుడి నుంచి వచ్చిన ఇండియన్ 2 మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ గా మిగిలింది. దీంతో సోషల్ మీడియాలో శంకర్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుండగా, తాజాగా ఇందులో మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. సినిమా డిజాస్టర్ కావడానికి దర్శకుడు కారణం కాదు, ఈ హీరోనే అంటూ మండిపడుతున్నారు నెటిజెన్లు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏం చేశాడు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

1996 లో రిలీజ్ అయిన భారతీయుడు అనే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా భారతీయుడు 2 థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్జె సూర్య వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రలో నటించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది.

Is Siddarth reason for Kamal Hassan s Indian 2 disaster netizens trolls

దీంతో మేకర్స్ సినిమాపై నెగటివ్ టాక్ రావడానికి నిడివి కారణమేమో అనే రీజన్ తో కొన్ని సీన్లు ట్రిమ్ చేసే పనిలో పడ్డారు. తాజాగా చిత్ర బృందం సినిమాను 12 నిమిషాల వరకు ట్రిమ్ చేసే రిలీజ్ చేస్తున్నామని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమాకి మరో సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. రానున్న ఆరు నెలలో భారతీయుడు 3 మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

కానీ ప్రస్తుతం అయితే ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ కావడానికి నిన్న మొన్నటిదాకా శంకర్ కారణం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ నడిచింది. తాజాగా ఈ సినిమా డిజాస్టర్ కావడానికి అందులో నటించిన హీరో సిద్ధార్థ కారణమంటూ యూటర్న్ తీసుకుని మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికో ప్రత్యేకమైన కారణం కూడా ఉంది.

Is Siddarth reason for Kamal Hassan s Indian 2 disaster netizens trolls

ఇండియన్ 2 మూవీ తమిళ, తెలుగు ప్రమోషన్ టైంలో ఆయన ప్రవర్తించిన తీరు గుర్తు చేస్తూ, అవే వీడియోలను ఉపయోగించి సిద్ధార్థ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక కార్యక్రమంలో సిద్ధార్థ మాట్లాడుతూ నా గత 20 ఏళ్లు బాయ్స్ మూవీ గురించి గొప్పగా చెప్పుకుంటూ గడిపాను. ఇక నెక్స్ట్ 20 ఏళ్ళు భారతీయుడు 2 గురించే చెబుతూ గడుపుతాను అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారు.

దీంతో ఇప్పుడు అదే డైలాగులు ఉపయోగించి వచ్చే 20 ఏళ్ల పాటు గుర్తుండేలా ట్రోల్ చేస్తున్నారు. అందుకే శంకర్ ని పక్కన పెట్టి ఇప్పుడు సిద్ధార్థని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో సిద్ధార్థ స్టార్ హీరోలు కూడా వ్యవహరించని విధంగా దురుసుగా ప్రవర్తించాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ యాటిట్యూడ్, బాడి లాంగ్వేజ్ ను పక్కన పెడితే కనీసం సినిమాలో అద్భుతంగా నటించాడు అనిపించేలా ఒక్క సన్నివేశం కూడా లేదంటూ ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: siddharth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X