Sobhita: శోభితను బలి పశువు చేయొద్దు.. నాగచైతన్య ఎమోషనల్
'తండేల్' సక్సెస్ తో నాగచైతన్యకు మంచి హిట్ పడింది. ప్రస్తుతం ఆ సక్సెస్ ను అక్కినేని యంగ్ హీరో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓవైపు ఆనందాన్ని విషయాలతో పాటు కొద్దిపాటుగా మనస్సును బాధించే వార్తలు కూడా చైతూ వినాల్సి వస్తోంది. అందులోనూ తన భార్య శోభితా గురించి అలాంటి న్యూస్ చైతూ దగ్గరికి చేరడంతో చాలా బాధపడుతున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు మద్దతుగా నిలుస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే.. తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇటీవల రాటాక్స్ విత్ వీకే పాడ్‌కాస్ట్‌లో ముచ్చటించారు. ఆ సందర్భంలో రిలేషన్ షిప్ బ్రేకప్ గురించి మాట్లాడారు. ఒక వ్యక్తి నుంచి వీడిపోవాలంటే వెయ్యిసార్లు ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చారు. మరిన్ని విషయాలపై ఓపెన్ అయ్యారు. అయితే.. చైతూ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని.. శోభితా వల్లే సమంత చైతూ విడిపోయారని, వీరి రిలేషన్ షిప్ ముందు నుంచే కొనసాగుతోందని తప్పుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యింది.

నాగచైతన్య వరకు తన భార్య శోభితా గురించి తప్పుగా వార్తలు వెళ్ళడంతో వెంటనే స్పందించారు. ఆ తప్పుడు న్యూస్ ను సరిచేశారు. శోభిత గురించి జరుగుతున్న ప్రచారంపై బాధగా ఉందన్నారు. తన మాజీ భార్య సమంతా రూత్ ప్రభుతో తాను విడిపోవడంలో శోభిత పాత్ర ఏమాత్రం లేదన్నారు. అయినా ఆమెపై జరుగుతున్న ట్రోల్స్ కు బాధితురాలైందన్నారు. ఈ విషయంలో చైతూ చాలా బాధగా ఉన్నానని తెలిపారు. ఈ విషయంలో ఆమె తప్పు ఏమీ లేదన్నారు.
శోభితా తన జీవితంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వాళ్లు ఒకరిజీవితంలోకి మరొకరు చాలా ఆర్గానిక్ గా, బ్యూటీఫుల్ వేలోనే వచ్చామన్నారు. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా చాట్ లాగానే స్టార్ట్ అయ్యిందన్నారు. అక్కటి నుంచి వారి స్నేహం ప్రారంభమైందని, నెమ్మదిగా వారి సంబంధం అక్కడి నుంచే బిల్డ్ అయ్యిందని వివరించారు. అంతే కానీ గతంతో తనకు శోభితాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అలాగే తన సరికొత్త జీవితం ప్రారంభానికి శోభిత తమ సంబంధంలోని ప్రతి అడుగునూ అర్థం చేసుకుందన్నారు. అలాంటి భార్య దొరకడం పట్ల గర్విస్తున్నానని తెలిపారు. కానీ అది ఆమెకు అంతా సులువైన పనికాదని, అయినప్పటికీ ఆమె ఎంతో ఒపిగ్గా, మెచ్యూర్డ్ గా అన్నీ విషయాలను డీల్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక 2024 ఆగస్టులో శోభిత నాగచైతన్య పెళ్లి చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. శోభితా వచ్చిన వేళా విశేషం చైతూ కెరీర్ లో 'తండేల్' రూపంలో గ్రాండ్ సక్సెస్ కూడా అందింది. ఈ శ్రీకాకుళం ఫిషర్ మెన్ పాత్రలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. సాయిపల్లవి ఫీమేల్ లీడ్ తో అదరగొట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పించారు. దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











