డ్రగ్స్ కేసులో మరికొంత సినీ తారలు.. అమన్ దీప్ అరెస్ట్‌తో కదులుతున్న డొంక!
తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను తెలంగాణ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. అయితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని గత కొద్దికాలంగా రేవంత్ రెడ్డి చేస్తున్న హెచ్చరికలను సీరియస్‌గా తీసుకొని పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన దాడిలో అమన్ ప్రీత్ సింగ్ దొరికిపోయాడు. అయితే ఈ కేసులో ఇంకా కొద్ది మంది సినీ తారలు ఉన్నారనే విషయం చర్చకు దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ నార్కోటిక్ పోలీసు విభాగానికి అందిన సమాచారంతో రాజేంద్ర నగర్ ప్రాంతంలో మెరుపు దాడి చేయగా.. డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న వైజాగ్‌కు చెందిన అల్లం సత్య వెంకట్ గౌతమ్, అమలాపురానికి చెందిన శానబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన కొరియోగ్రాఫర్ మహ్మద్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. వారందించిన సమాచారంతో అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్‌ను వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.

ముందస్తు సమాచారం ప్రకారం పోలీసులు పక్కాగా ట్రాక్ చేశారు. బయ్యర్స్, సెల్లర్స్ మీటింగ్ పెట్టుకొంటున్నారనే సమాచారం ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లాం. వారిని పట్టుకొని అదుపులోకి తీసుకొన్నాం. వారి నుంచి 2 పాస్ పోర్టులు, 10 సెల్ ఫోన్స్, 2 బైకులు సీజన్ చేశాం. విఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నది అని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇదిలా ఉండగా, అమన్ ప్రీత్‌తోపాటు ప్రసాద్ అనే బిల్డర్‌ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతడికి మూత్రపరమైన వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు మొత్తం ఇద్దరు నైజీరియా, ముగ్గురు స్థానికులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ కమిషన్ అవినాష్ మహంతి తెలిపారు.

అయితే తాజాగా ఐదుగురిని, అమన్ ప్రీత్‌ను విచారించగా.. పలువురు సినీ ప్రముఖులు పేర్లు వినిపించాయి. నిందితులు చెప్పిన సమాచారం ప్రకారం.. సాక్ష్యాలతో వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దాంతో మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ డొంక కదిలే అవకాశం ఉందని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











